YS Viveka Update:నార్కో అనాలసిస్ పరీక్షల కోసం పిటీషన్ - కీలకంగా సునీల్ స్టేట్‌మెంట్!!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. కీలక వ్యక్తులను విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ విచారించిన అనుమానితుడు సునీల్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. పులివెందుల కోర్టు మేజిస్ట్రేట్ సెలవుపై వెళ్లడంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. సునీల్ తరపు న్యాయవాది హితేష్ కుమార్, సీబీఐ అధికారులు హాజరయ్యారు.

ప్రస్తుతం ఖైదీగా సునీల్ ..

కేసు విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా సునీల్ ఉన్నాడు. కేసు విచారణ అనంతరం సునీల్‌కు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తండ్రి, వైసీపీ పులివెందుల ఇన్‌చార్జి వైఎస్‌ భాస్కరరెడ్డి తో పాటు ఆయన సోదరుడు వైఎస్‌ మనోహర్‌రెడ్డిలను అధికారులు మంగళవారం పులివెందుల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సుదీర్ఘంగా విచారించారు. భాస్కరెడ్డిని తొలుత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విచారించారు.

YS Vivekanada Reddy Row: CBI files petition to allow Narco tests on Accused Sunil Yadav

సుదీర్ఘంగా భాస్కర రెడ్డి-మనోహర్ రెడ్డి విచారణ..

భోజనం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు రెండోవిడత విచారణకు హాజరయ్యారు. ఆయన సోదరుడు మనోహర్‌రెడ్డిని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విచారించారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు చిన్నాన్నలు అవుతారు. వీరిద్దరినీ సీబీఐ ఈ రోజు మరో సారి విచారిస్తోంది. ఇదే సమయంలో వివేకా కుమార్తె సునీత సీబీఐ అధికారులను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే హైకోర్టుకు, ఢిల్లీలో సీబీఐ అధికారులకు తన తండ్రి హత్య కేసులోని 15 మంది అనుమానితుల లిస్టును సునీత ఇచ్చారు.

సీబీఐ అధికారులతో సునీత సమావేశం..

Recommended Video

    CBI సీజ్ చేసిన బంగారంలో 103 కిలోలు మిస్.. విచారణకు ఆదేశించిన మద్రాస్ హైకోర్టు!

    సీబీఐ అధికారులను కలిసిన సునీత గతంలోనే అదే జాబితా వారికి ఇచ్చినట్లుగా ప్రచారం సాగింది. అయితే, ఈ రోజు మరోసారి కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, ఈ కేసుకు రాజకీయంగానూ ప్రాధాన్యత ఉండటంతో సీబీఐ చేస్తున్న విచారణ.. తీసుకుంటున్న చర్యల పైన ఆసక్తి నెలకొని ఉంది. కొద్ది రోజుల క్రితం సునీల్ సోదరుడు చేసిన వ్యాఖ్యలు సైతం చర్చకు కారణమయ్యాయి. కడపలోనే మకాం వేసిన సీబీఐ అధికారుల టీం..ఇప్పటికే సునీల్ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఆర్దిక లావాదేవీల పైన కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+