వివేకా కేసు దోషులకు మరణశిక్ష ? సుప్రీంలో కుమార్తె, అల్లుడికి ఊరట..!

ఏపీలో ఆరేళ్ల క్రితం తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు.. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందా లేదా అని సీబీఐని అడిగింది. దీంతో ముగిసినట్లు సీబీఐ జవాబిచ్చింది. అనంతరం ఇవాళ వాదనలు జరిగాయి.

ఈ సందర్భంగా గతంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై అప్పటి జగన్ సర్కార్ నమోదు చేసిన కేసుల ప్రస్తావన వచ్చింది. ఈ కేసులో కుట్ర పూరితంగా మృతుడి కూతురు, అల్లుడితో పాటు సీబీఐ అధికారిపైనా కేసులు నమోదు చేసినట్లు సునీత లాయర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన జస్టిస్ సుందరేశన్ ధర్మాసనం ఈ కేసుల్ని కొట్టేస్తామని ప్రకటించింది. దీంతో ఈ ముగ్గురికీ ఊరట లభించింది.

ys Vivekananda murderers can get death sentence cbi told sc relief to daughter son-in-law

మరోవైపు వివేకా హత్య కేసులో నిందితులు జైల్లోనే ఉండటంపై సీబీఐ లాయర్ గా హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు .. ఈ హత్య కేసు చాలా తీవ్రమైనదని, హత్య చేసి గుండెపోటు అని ప్రచారం చేశారని, ఆ తర్వాత రక్తపు వాంతులు చేసుకున్నట్లు కూడా ప్రచారం చేశారన్నారు. చివరికి హత్య ఆధారాలు చెరిపేశారని నిందితుల గురించి సుప్రీంకు వివరించారు. ఈ కేసులో వీరికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని సీబీఐ లాయర్ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ys Vivekananda murderers can get death sentence cbi told sc relief to daughter son-in-law

మరోవైపు ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పడంపై సునీత తరఫు న్యాయవాది సిద్ధార్ధ లూత్రా అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు దర్యాప్తుకు గడువు విధించడం వల్లే సీబీఐ ఇలా దర్యాప్తు ముగించేసినట్లు చెబుతోందన్నారు. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో సీబీఐ ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే అదనంగా దర్యాప్తు కొనసాగిస్తామని తెలిపింది. దీనిపైనా సుప్రీం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+