వివేకా హత్య కేసు తేల్చేసిన సీబీఐ.. ! సుప్రీంలో క్లారిటీ..!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘ దర్యాప్తు చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం స్పష్టత ఇచ్చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు వినిపించే క్రమంలో సీబీఐ ఈ క్లారిటీ ఇచ్చింది.

వివేకా హత్య కేసులో గతంలో సీబీఐ అరెస్టు భయంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. దీన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ తన అభిప్రాయం తెలిపింది. అయితే దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. వివేకా కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగిస్తారా లేదా అన్న దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని గత విచారణ సందర్భంగా ఆదేశించింది.

ys Vivekananda reddy murder case inquiry finished cbi informed to supreme court

ఈ నేపథ్యంలో సీబీఐ ఇవాళ సుప్రీంకోర్టులో తన అభిప్రాయం చెప్పేసింది. వివేకా హత్య కేసుపై తమ దర్యాప్తు ముగిసిందని వెల్లడించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశిస్తే మాత్రం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. మరోవైపు వివేకా కేసులో దర్యాప్తు ముగిసిందన్న సీబీఐ అఫిడవిట్ పై వాదన వినిపించేందుకు సునీతారెడ్డి తరఫు లాయర్ మరో కోర్టులో విచారణలో ఉన్నారు. దీంతో జస్టిస్ సందరేశన్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం.. విచారణను తాత్కాలికంగా వాయిదా వేసింది. సునీతారెడ్డి లాయర్ రాగానే మరోసారి విచారణ జరిపి వివేకా కేసులో నిందితుల బెయిల్ రద్దుపై కీలక నిర్ణయం వెలువరించనుంది.

ys Vivekananda reddy murder case inquiry finished cbi informed to supreme court

2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తిపై 2020లో వైసీపీ అధికారంలోకి వచ్చాక హైకోర్టు సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఐదేళ్లుగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. కీలక నిందితుల్ని అరెస్టు చేసింది కొందరు బెయిల్‌పై ఉన్నారు. ఈ హత్యలో కీలక సూత్రధారులు ఇంకా అరెస్టు కాలేదని వివేకా కుమార్తె సునీత ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీతారెడ్డి దర్యాప్తు వేగంగా పూర్తి చేసేలా కీలక ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ కేసులో సీబీఐ నత్తనడక కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ అసలు దర్యాప్తు ముగిసిపోయిందంటూ సుప్రీంకోర్టుకు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+