త్వరలో వివేకా హత్యపై ఛార్జిషీట్-సీబీఐ కోర్టుకు వెల్లడించిన సీబీఐ ! సుప్రీం ఆదేశాల ఎఫెక్ట్ ?
ఏపీలో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలుకు సిద్దమవుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మారింది. దీంతో కొత్త సిట్ త్వరలో ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చి అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణకు సీబీఐ నలుగురు నిందితుల్ని హాజరుపర్చింది. ఇందులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ యాదవ్ ను ఉన్నారు. అదే సమయంలో తాజా పరిస్ధితిపై సీబీఐ మెమో కూడా దాఖలు చేసింది. ఇందులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మారిన సిట్ ఈ కేసును దర్యాప్తు చేయబోతున్నట్లు వెల్లడించింది.

ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ స్పెషల్ పీపీ ఈ మెమోను దాఖలు చేశారు. అనంతరం స్పెషల్ పీపీకి ఈ కేసు విచారణలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది వెల్లడించారు. దీంతో తదుపరి విచారణను సీబీఐ కోర్టు.. వచ్చే నెల 28కి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును వచ్చే నెల 30లోపు సీబీఐ పూర్తి చేయాల్సి ఉంది. దీంతో రాబోయే నెల రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు తాజాగా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి దాన్ని ఆ తర్వాత వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications