ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపిలోనే ఉంటాం: అగ్నిసాక్షిగా ఎమ్మెల్యేల ప్రమాణం

By Pratap
|
Google Oneindia TeluguNews

YSRCP
ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ జిల్లాలో మూడు శాసనసభా స్థానాలను, ఒక ఎంపీ స్ధానాన్ని వైయస్ జగన్ నాయకత్వంలోని వైసిపి గెలుచుకుంది. వైరా ఎమ్మెల్యే మదన్‌లాల్‌ ఇటీవలే పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరడంతో పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడుతున్నారన్నా ప్రచారం ముమ్మరమైంది.

దీంతో గురువారం జిల్లా పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడేది లేదంటూ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదుట వెలిగించిన జ్యోతిపై ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ప్రమాణం చేశారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన ఖమ్మం జిల్లా సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తమ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ఆయనతోపాటు టిడిపి ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్‌, 18 మంది జడ్పీటీసీ సభ్యులు, 18 మంది ఎంపీపీలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడుసహా 25 మంది మండల పార్టీ అధ్యక్షులు కూడా ఈ సందర్భంగా గులాబీ కండువాలు కప్పుకుంటారని చెప్పారు.

అలాగే టీడీపీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఖమ్మం జిల్లా నాయకుడు రాంబాబు, కోదాడ మాజీ ఎమ్మెల్యే వి.చందర్‌రావు, ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా పార్టీలో చేరుతారని తెలిపారు. తెరాస అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం సాయంత్రం 4-5 గంటల మధ్య ఉంటుందని చెప్పారు.

English summary
YSR Congress Khammam district MP Ponguleti Srinivas Reddy and MLAs Payam Venkateswarlu Thati Venkateswarlu took with to remain in the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X