2025లో వైఎస్ జగన్‌ను వెంటాడుతున్న రాహువు-కేతువు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా ఇతర పార్టీల్లో చేరడమో, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉండటమో చేస్తున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిద్దామంటే ఎవరూ ముందుకు రావడంలేదు. ఇటువంటి పరిస్థితుల మధ్యే కొత్త సంవత్సరం 2025 వచ్చేసింది. అందరిలానే వైఎస్ జగన్ జాతకం కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం.
ఆ రెండు జగన్ ను గట్టిగా పట్టుకున్నాయి
ఐదు సంవత్సరాలు రాజభోగం అనుభవించిన తర్వాత సాధారణ జీవితంలోకి రావడానికి జగన్ కు కొంత సమయం పట్టింది. జ్యోతిష్యులు మాత్రం కొత్త ఏడాదిలో కూడా జగన్ కు కష్టాలు తప్పవంటున్నారు. ప్రభుత్వంలో వచ్చిన అవినీతి ఆరోపణలతోపాటు వాటిని ఎదుర్కొంటున్న పార్టీ సీనియర్ నేతలకు ఇక్కట్లు తప్పవని, బాలీవుడ్ నటి జత్వానీ కేసుతోపాటు సోషల్ మీడియా కేసు మాత్రం గత ప్రభుత్వానికి గట్టిగా చుట్టుకుంటుందని చెబుతున్నారు. రాహువు, కేతువు జగన్ ను పట్టి పీడిస్తున్నాయని, ఏదైనా ఒక విషయంలో ముందుకు వెళ్లామని సంతోషించేలోగా మరో నాలుగు విషయాల్లో వెనక్కి వెళ్లాల్సి వస్తోందని, ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగులు వెనక్కి అన్నట్లుగా జగన్ పరిస్థితి ఉందని, కొత్త సంవత్సరంలో కూడా మాజీ ముఖ్యమంత్రికి చిక్కులు తప్పవని తేల్చిచెబుతున్నారు.

ఆ కేసు మరింత తీవ్రమవుతుంది
తిరుపతి లడ్డూ వ్యవహారంలో వైవీసుబ్బారెడ్డి, కాకినాడ పోర్టు కేసులో వైవీ సుబ్బారెడ్డి కొడుక్కి, ఈడీ కేసులో విజయసాయిరెడ్డికి, సోషల్ మీడియా కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆయన కుమారుడు భార్గవరెడ్డికి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు. అంతేకాకుండా జత్వానీ కేసు మరింత తీవ్రరూపు దాలుస్తుందని, దీనికి కారకులైనవారందరికీ కష్టాలు ఖాయమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం జగన్ వైపు దృష్టి సారించనప్పటికీ ఆయన చుట్టూ ఉన్నవారిపై మాత్రం గట్టిగా దృష్టిసారించి వారు చేసిన అవినీతిని తవ్వితీసి కేసులు నమోదు చేస్తోంది. వారంతా ఆయా కేసుల్లో ఇరుక్కున్నారని, వీరు ఇరుక్కోవడమే కాకుండా జగన్ ను కూడా భవిష్యత్తులో ఇరికించే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం రాహువు, కేతువు గ్రహాలేనని, జాతకంలో ఇవి శుభస్థానంలో లేవన్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా నాయకులను వలసబాట పట్టిస్తున్నాయని, అయితే వైసీపీ నాయకులను చేర్చుకోవడానికి ఇతర పార్టీలేవీ ముందుకు రావడంలేదంటున్నారు. మొత్తంగా 2025 సంవత్సరం కూడా జగన్ ను కష్టాలవైపే నడిపిస్తోందని జ్యోతిష్యులు స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications