టిలో జగన్ రెడీ: షర్మిలకి బాధ్యతలు, ఆ స్థానాలపై కన్ను

తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడే షర్మిల కచ్చితంగా మైనార్టీ, సీమాంధ్ర ప్రజలతో పాటు దళితులు, బిసిలు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకుంటారనే విశ్వాసంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకునేంత వరకు ఈ ప్రాంతంలో జగన్ పార్టీకి మంచి పునాదులు ఉండేవి.
కాని విభజనను వ్యతిరేకిస్తూ సమన్యాయమని, మళ్లీ సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకోవడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి జనక ప్రసాద్, గట్టు రామచంద్ర రావు, రాఘవ రెడ్డి తదితరులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 119 సీట్లు, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.
కనీసం ఆరు శాతం సీట్లు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జాతీయ పార్టీ స్థానం దక్కే అవకాశం ఉంది. 119 నియోజకవర్గాల్లో ప్రచారం అక్కర్లేదు. కాని అభ్యర్థుల కొరత ఉంది. పార్టీ సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది. అందుకే 119 సీట్లలో అభ్యర్థులను పోటీకి నిలబెట్టినా, 50 స్థానాల్లో మాత్రం గట్టి అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు.
అందులో 25 స్థానాలపై పూర్తి స్థాయిలో పట్టు బిగించి గెలిచేందుకు వ్యూహాలు ఉన్నాయట. ముస్లింలు, దళితులతోపాటు బిసి, రెడ్డి సామాజికవర్గాల్లో దివంగత వైయస్‌కు చాలామంది అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. లోకసభ స్థానాలకు వచ్చేసరికి, మహబూబాబాద్, మల్కాజగిరి, ఖమ్మం, సికింద్రాబాద్, చేవెళ్ల సీట్లపై దృష్టి పెట్టారు.
మల్కాజగిరిలో 80 శాతం సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. మజ్లిస్, సిపిఎం పార్టీతో పొత్తు కలిసి వస్తుందనే ఆశతో ఆ పార్టీ ఉంది. కాని తెరాసతో పొత్తుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
-
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!












Click it and Unblock the Notifications