ఏపీ రాజధాని భూసేకరణకు జగన్ పార్టీ పొగ (పిక్చర్స్)
గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూసేకరణ చేసే విషయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొగ పెడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. భూసేకరణపై అభిప్రాయ సేకరణకు వచ్చిన మంత్రి వర్గ ఉప సంఘం సభ్యులకు స్థానిక రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుండగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చేపట్టిన అభిప్రాయ సేకరణ ప్రభుత్వానికి మరో తలనొప్పిగా పరిణమించింది.
భూముల సేకరణపై రైతుల అభిప్రాయాలు సేకరించడానికి జగన్ రాజధాని రైతుల, కూలీల పరిరక్షణ కమిటీనే వేశారు. ఆ కమిటీ సోమవారం గుంటూరు జిల్లాలోని తుళ్లూరు మండలంలో పర్యటించింది. అయితే, రైతులు భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేరని తేల్చడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది.
రాజధానికి భూములు ఇచ్చేందుకు రైతులు సుముఖంగా ఉన్నారని కొన్ని పత్రికల్లో కథనాలు చూసి నిజమే అనుకున్నామని, అయితే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందని కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాద రావు చేసిన వ్యాఖ్యను చూస్తుంటే భూసేకరణకు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభిప్రాయం కూడా సమస్యగా తయారయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

అభిప్రాయ సేకరణ
రాజధానికి భూముల సేకరణపై రైతుల అభిప్రాయం తెలుసుకోవడానికి వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు ఏర్పాటు చేసిన కమిటీ ముందు బోరుపాలెంకు చెందిన ఓ మహిళ ఇలా..

బోరుపాలెం రైతులతో..
తుళ్లూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కమిటీ సభ్యులు ఇలా రైతుల అభిప్రాయాలు వింటూ..

రైతులకు కమిటీ నేతలు హామీ..
రాజధానిని నిర్మించ తలపెట్టిన గ్రామాల్లో రైతులు ధైర్యంగా ఉండాలని, వారి వెంట తాము ఉంటామని, చివరకు రైతుల తరఫున నిలబడి పోరాటం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హామీ ఇచ్చారు.

లాక్కుంటే చూస్తూ ఊరుకోం..
ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కుంటే చూస్తూ సహించబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు రైతులకు భరోసా ఇచ్చారు.

గ్రామాల్లో పర్యటన...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాజధాని రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు తుళ్లూరు మండలంలోని బోరుపాలెం, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటించారు.

పింఛను కోసం వృద్ధురాలు..
మూడు నెలలుగా తనకు పింఛను రావడం లేదని, తనకు సెంటు భూమి కూడా లేదని, తన పేరును పింఛను జాబితా నుంచి తొలగించామని అధికారులు చెబుతున్నారని బొంతల కోటేశ్వరమ్మ అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

చంద్రబాబును నమ్మం...
కృష్ణానది కరకట్ట గ్రామాల ప్రజలు, రైతులు రాజధానికి భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరని, దౌర్జన్యం చేసి భూములు లాక్కుంటే సహించేది లేదని బోరుపాలెం రైతు దాసరి కోటేశ్వర రావు అన్నారు.

భూములు ఇచ్చేది లేదు..
రాజధానికి భూములు ఇచ్చేది లేదని రైతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కమిటీ ముందు చెప్పారు. అదే విషయాన్ని వైయస్ జగన్‌కు నివేదించి రైతుల పక్షాన పోరుడాతమని కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాద రావు చెప్పారు.












Click it and Unblock the Notifications