జొన్నలగడ్డలో వైఎస్ఆర్ విగ్రహం మాయం.. టీడీపీ పనే అంటూ ఆందోళనకు దిగిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య రోజుకో చోట రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నిత్యకృత్యంగా మారింది. ఇక వైఎస్సార్ విగ్రహాలు ధ్వం అయినా, మాయం అయినా టీడీపీ పనే అని, ఎన్టీఆర్ విగ్రహాలు మాయం అయినా, ధ్వంసం అయినా వైసీపీ పనే అని విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి ఉంది.
ఇక తాజాగా గుంటూరు జిల్లా జొన్నలగడ్డలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. గురువారం రాత్రి స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వైయస్సార్ విగ్రహం మాయం కావడంతో వైసీపీ నేతలు ఇది తెలుగుదేశం పార్టీ నేతల పనేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఆందోళనకు దిగి టీడీపీ అధినేత చంద్రబాబుపై, టీడీపీ నాయకులపై ధ్వజమెత్తుతున్నారు. గతంలో జొన్నలగడ్డ సొసైటీ బిల్డింగ్ ప్రాంగణంలో ఎన్టీఆర్, వైఎస్సార్ విగ్రహాలను పక్కపక్కనే వారి అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తాజాగా వైయస్సార్ విగ్రహాన్ని మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

వైయస్సార్ విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన వ్యక్తులు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇది తెలుగుదేశం పార్టీ నేతల పనేనని వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి వైసీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులే కావాలని వైఎస్ఆర్ విగ్రహాన్ని మాయం చేశారని వారు ఆరోపిస్తున్నారు. విగ్రహం మాయం చేసిన వారిని అరెస్ట్ చెయ్యాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇది తెలుగుదేశం పార్టీ నేతల పనేనని టిడిపి నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నరసరావుపేటలో అలజడులు సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడిన వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గతంలో ఎన్టీఆర్ చనిపోయినప్పుడు, హరికృష్ణ మరణించినప్పుడు పాడె మోయని చంద్రబాబు, టీడీపీ కార్యకర్త చనిపోయాడని పాడె మోస్తూ రాజకీయాలు చేస్తున్నాడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్త హత్యకు వైసీపీకి ముడిపెడుతూ కావాలని రచ్చ చేస్తున్నాడని మండిపడ్డారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications