గురజాల లో వైఎస్సార్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులు
గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసాను పల్లి గ్రామంలో అర్ధరాత్రి వేళ వైయస్సార్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తగులబెట్టారు. పాత గుడ్డలు విగ్రహం పై వేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.
విగ్రహం దాదాపు బాగా కాలిపోయింది. ఎవరో అల్లరి మూకలు ఈ పని చేసి ఉండవచ్చు నని స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం విషయం గ్రహించిన గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకి దిగారు.

విగ్రహం కి నిప్పు పెట్టిన దుండగులని వెంటనే అరెస్టు చేయాలని సంఘటన ప్రాంతం లో ఆందోళనకి దిగారు. రాజకీయ విభేదాలతోనే ఈ ఘటనకు పాలపడ్డారని మరి కొందరు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications