ఉండవల్లి శ్రీదేవికి కార్యకర్తల షాక్: చీరల నుండి చెప్పులవరకు గిఫ్టులన్నీ మావే.. తీసుకెళతాం!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై జరుగుతున్నంత రగడ మరే ఇతర ఎమ్మెల్యేల పైన జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీకి అమ్ముడుపోయారని ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేస్తున్న వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి ప్రచార రథాన్ని తామే కొనుగోలు చేసి ఇచ్చామని ఇటీవల ఆమె ప్రచార రథాన్ని కొందరు కార్యకర్తలు తీసుకువెళ్లారు. ఇక తాజాగా ఉండవల్లి శ్రీదేవి ఏ కార్యక్రమానికి వచ్చిన గిఫ్ట్ ఇస్తేనే వచ్చే వారని, శ్రీదేవి ఇంట్లో ఉన్న చాలా గిఫ్టులు కార్యకర్తలు ఇచ్చినవేనని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కచ్చితంగా వాటిని తిరిగి తీసుకువెళ్తామని శ్రీదేవికి షాక్ ఇస్తున్నారు.
ఉండవల్లి శ్రీదేవి ప్రధాన అనుచరుడు అయిన వైసిపి నేత సందీప్ తాజాగా ఉండవల్లి శ్రీదేవి పై మరో సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఎన్నికల ప్రచారం కోసం ప్రచార రథం లేదంటే తానే ప్రచార రథం కొనిచ్చానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుండి, ఆమె ఇంట్లో ఉన్న ఫ్రిజ్ వరకు ప్రతి వస్తువు కార్యకర్తలే కొనుగోలు చేశారన్నారు.

ఆమె ఎవరైనా కార్యకర్త ఇంటికి పుట్టినరోజులకు కేక్ కటింగ్ చేయడానికి వస్తే విలువైన బహుమానాలు ఇవ్వాలని కోరేదని, తన ఇంటికి కూడా కేక్ కటింగ్ కి రావాలని కోరితే, మూడు లక్షల విలువ చేసే రింగ్ ఇస్తే కానీ రానన్నారని సందీప్ ఆరోపణలు చేస్తున్నాడు. అందరూ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు బహుమానాలు ఇస్తే, తాడికొండ ఎమ్మెల్యేకు మాత్రం మేమే బహుమతులు ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు.
ఆమె కట్టుకున్న చీరల దగ్గర నుండి, చెప్పులు, చెవి కమ్మలు అన్నీ కార్యకర్తల కష్టమేనని, ఆమె ఆఫీసులో, ఆమె ఇంట్లో తమ కొనిచ్చిన ప్రతి వస్తువును తిరిగి తెచ్చుకుంటామని హెచ్చరించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. భర్తని, కూతురుని ఇప్పుడు మీడియా ముందుకు తీసుకువచ్చి డ్రామాలు చేస్తుందని, ఇప్పుడు కూతురిపై ఎవరైనా కామెంట్ చేస్తే బాధపడుతుందని, రాజకీయాల్లోకి వాళ్లను కూడా లాగాల్సిన అవసరం ఏమిటో చెప్పాలని సందీప్ ప్రశ్నిస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications