Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లులూ గ్రూప్ కు బెజవాడ స్వరాజ్ మైదాన్-అంబేద్కర్ పేరు తీసేసి-వైసీపీ షాకింగ్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ ఇవాళ సంచలన ఆరోపణలు చేసింది. నగరం న‌డిబొడ్డున ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ 125 అడుగుల విగ్రహాన్ని చూస్తే కూట‌మి నాయ‌కుల క‌డుపులు మండిపోతున్నాయ‌ని, ఎలాగైనా ఆ విగ్ర‌హాన్ని తొల‌గించి స్వ‌రాజ్ మైదాన్ ప్రాంతాన్ని లూలూ గ్రూప్‌కి ఇచ్చేయాల‌న్న కుట్ర జ‌రుగుతోంద‌ని వైఎస్సార్సీపీ అధికార ప్ర‌తినిధి జూపూడి ప్ర‌భాక‌ర్ ఆరోపించారు.

దేశ‌మంతా అంబేడ్క‌ర్ రాజ్యాంగంతో పాల‌న జ‌రుగుతుంటే ఏపీలో మాత్రం రెడ్ బుక్ పాల‌న న‌డుస్తోంద‌ని జూపూడి మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత... ప్రపంచ మేధావి, పేద బ‌డుగు వ‌ర్గాల‌కు మేలు చేసిన అంబేడ్క‌ర్ విగ్రహానికి కూడా కూటమి నేతలు నివాళులు అర్పించని విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ పేరును దుండగలు తొలగించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. తాజాగా రెండు రోజుల క్రితం అంబేద్కర్ పేరు కూడా తొలిగించి రాజ్యాంగ నిర్మాతను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ysrcp alleges chandrababu plans to handover Vijayawada swaraj maidan to lulu group

ఈ వరుస పరిణామాలు చూస్తుంటే విడ‌తల వారీగా అంబేద్కర్ విగ్ర‌హాన్ని తొల‌గించే కుట్ర‌కు తెర‌లేపారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయ‌ని జూపూడి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మహనీయుడు అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని అడ‌వుల్లో పెట్టాలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో వైఎస్ జ‌గ‌న్ పేరును తొల‌గించిన‌ప్పుడే వైసీపీ నేతలు, అంబేడ్క‌ర్ వాదులు పోలీసుల‌కు, నేష‌న‌ల్ ఎస్సీ క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తే... విగ్ర‌హం ఏర్పాటు చేసిన వారి పేరునే ఉంచాల‌ని ప్ర‌భుత్వానికి చెప్పినా స్పంద‌న లేద‌న్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+