ఏపీలో లాక్ డౌన్ ఉల్లంఘనలు- పోలీసులకు ఛాలెంజ్ లు- వైసీపీ, టీడీపీ పోటాపోటీ...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ అమలవుతున్నా రాజకీయ నేతలకు మాత్రం నిబంధనలు పట్టడం లేదు. కనీసం సామాజిక దూరం నిబంధనలు కూడా పాటించకుండా ఇష్టారాజ్యంగా జనంలో తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు.. ఇప్పుడు పోలీసులకు సవాళ్లు కూడా విసరడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోలీసులు కూడా సరైన సమయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

    Lockdown 3.0: AP Govt's Focus on Coronavirus Red Zones | Oneindia Telugu
    యథేచ్ఛగా లాక్ డౌన్ ఉల్లంఘన

    యథేచ్ఛగా లాక్ డౌన్ ఉల్లంఘన

    ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైన తొలి రోజుల్లో ఇళ్లకే పరిమితమైన రాజకీయ పార్టీల నేతలు కొన్నిరోజులుగా మాత్రం విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. లాక్ డౌన్ అమల్లో ఉండగానే ఇంటింటికీ వెళ్లి కూరగాయలు, నిత్యావసరాలు పంచుతూ హంగామా చేసిన నేతలు.. తాజాగా జనాన్నే తమ వద్దకు రప్పించుకుని వీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందులో తప్పులేకపోయినా కనీసం సామాజిక దూరం కూడా పాటించకపోవడమే ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

    పోలీసులకు వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు...

    పోలీసులకు వైసీపీ, టీడీపీ నేతల సవాళ్లు...

    లాక్ డౌన్ లో సామాజిక దూరం నిబంధనలు పాటించకుండా పోటాపోటీగా నిత్యావసరాల పంపిణీ చేపడుతున్న వైసీపీ, టీడీపీ నేతలు .. ప్రశ్నిస్తున్న అధికారులు, పోలీసులపై మాత్రం నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోలీసులకు చేతనైతే తనను అరెస్టు చేయాలని సవాల్ విసరగా.. కొన్ని గంటల వ్యవధిలోనే విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం కూరగాయల పంపిణీపై అధికారులు కేసు నమోదు చేయడాన్ని విమర్శించారు. కేసులు పెట్టుకోవచ్చంటూ పోలీసులకు ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

    ప్రచారం కోసమే పంపిణీలు.. సామాజిక దూరం మాత్రం..

    ప్రచారం కోసమే పంపిణీలు.. సామాజిక దూరం మాత్రం..

    ప్రచారం కోసం పేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరంతా.. సామాజిక దూరం పాటిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ సామాజిక దూరం కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా తిరుగుతూ వీరు చేస్తున్న హంగామా మొత్తం సమాజానికే ప్రమాదకరంగా మారుతోంది. ఈ చిన్న విషయాన్ని కూడా గుర్తించకపోవడమే ఓ తప్పిదమైతే... అడ్డొచ్చిన అధికారులు, పోలీసులకు అరెస్టులు చేసుకోమని, కేసులు పెట్టుకోమని సవాళ్లు విసరడమేంటని జనం విస్తుపోతున్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధులు అయి ఉండి కూడా ఇలా చట్టాన్ని తామే ఉల్లంఘిస్తే సాధారణ జనం కూడా రేపు అదే బాట పడితే ఏం జరుగుతుందని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+