వైసీపీలో పార్టీ పదవుల ప్రకటన-జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు వీరే

ఏపీ కేబినెట్ ప్రక్షాళన నేపథ్యంలో వైసీపీలో తలెత్తిన అసమ్మతిని చల్లార్చేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇవాళ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలను ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ ఈ జాబితాలు విడుదల చేశారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 26 జిల్లా ప్రకారం జిల్లా అధ్యక్షుల పేర్లను సజ్జల ప్రకటించారు. ఇందులో శ్రీకాకుళానికి ధర్మాన కృష్ణదాస్, విజయనగరానికి మజ్జి శ్రీనివాసరావు, అల్లూరి జిల్లాకు భాగ్యలక్ష్మి, పార్వతీపురం జిల్లాకు పాముల పుష్పశ్రీవాణి, విశాఖ జిల్లాకు అవంతి శ్రీనివాస్, అనకాపల్లి జిల్లాకు కరణం ధర్మశ్రీ, తూగో జిల్లాకు జక్కంపూడి రాజాను ప్రకటించారు. అలాగే కాకినాడ జిల్లాకు కన్నబాబును, కోనసీమ జిల్లాకు పొన్నాడసతీష్, పశ్చిమగోదావరి జిల్లాకు రంగనాధరాజును, ఏలూరు జిల్లాకు ఆళ్లనానిని, కృష్ణా జిల్లాకు పేర్నినానిని, ఎన్టీఆర్ జిల్లాకు వెల్లంపల్లి శ్రీనివాస్ ను ఎంపిక చేశారు.

ysrcp announced presidents newly formed 26 districts and regional incharges

గుంటూరు జిల్లాకు మేకతోటి సుచరితను, బాపట్ల జిల్లాకు మోపిదేవి వెంకటరమణను, పల్నాడు జిల్లాకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ప్రకాశం జిల్లాకు మధుసూధన్ యాదవ్ ను ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, కర్నూలు జిల్లాకు బాలనాగిరెడ్డిని, నంద్యాల జిల్లాకు రాంభూపాల్ రెడ్డిని ప్రకటించారు. అనంతపురం జిల్లాకు కాపురామచంద్రారెడ్డిని, సత్యసాయిజిల్లాకు శంకర్ నారాయణను, అన్నమయ్య జిల్లాకు గడికోట శ్రీకాంత్ రెడ్డిని, వైఎస్సార్ జిల్లాకు సురేష్ బాబును ఎంపిక చేశారు. తిరుపతికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, చిత్తూరు జిల్లాకు కేఆర్జే భరత్ ను అధ్యక్షులుగా ప్రకటించారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను 9 ప్రాంతాలుగా విభజించి 11 మందిని ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఎంపిక చేసారు. శ్రీకాకుళం, విజయనగరం,పార్వతీపురం, మన్యం జిల్లాకు ప్రాంతీయ సమన్వయకర్తగా బొత్స సత్యనారాయణను, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వైవీ సుబ్బారెడ్డిని, కోనసీమ, కాకినాడ, తూగో, పగో, ఏలూరు జిల్లాలకు పిల్లి సుభాష్ చంద్రబోస్, పీవీ మిథున్ రెడ్డిని, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాలకు మర్రి రాజశేఖర్ ను, గుంటూరు, పల్నాడు జిల్లాలకు కొడాలి నానిని, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు బాలినేని శ్రీనివాసులురెడ్డిని ఎంపిక చేశారు. చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, కడప, తిరుపతి జిల్లాలకు అనిల్ కుమార్ యాదవ్ ను, కర్నూలు, నంద్యాల జిల్లాలకు బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రాంతీయ సమన్వయకర్తలుగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+