వైఎస్ జగన్ వెంటే జనం: వారికి పాదాభివందనం: ప్రాధాన్యతలు ఇవే: బద్వేలు సుధ..ఫస్ట్ రియాక్షన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, నిష్పక్షపాత పరిపాలన వల్లే తనకు ఇంతటి భారీ గెలుపు సాధ్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ అన్నారు. 2019లో వైఎస్ జగన్‌ను నమ్మి బద్వేలు ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారని, తన భర్తను 44 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి, అసెంబ్లీకి పంపించారని చెప్పారు. ఇప్పుడు వైఎస్ జగన్ అందించే పరిపాలనను చూసి తనను ఎన్నుకున్నాని వ్యాఖ్యానించారు. తన కుటుంబాన్ని రెండుసార్లు ఆదరించిన బద్వేలు ఓటర్లకు రుణపడి ఉంటానని చెప్పారు.

భారీ మెజారిటీ..

భారీ మెజారిటీ..

బద్వేలు ఉప ఎన్నికలో డాక్టర్ దాసరి సుధ.. కళ్లు చెదిరే మెజారిటీతో విజయదుందుభిని మోగించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌పై 90,590లకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. సుమారుగా రెండు లక్షలకు పైచిలుకు ఉండే ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఓట్లను సాధించడం అనేది తిరుగులేని రికార్డుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రచారం చేయనప్పటికీ.. ఆ పార్టీకి ఈ స్థాయిలో పట్టం కట్టారు బద్వేలు ఓటర్లు.

స్పందించిన డాక్టర్ సుధ..

స్పందించిన డాక్టర్ సుధ..

ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఆమె స్పందించారు. విలేకరులతో మాట్లాడారు. తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. బద్వేలు ఓటర్లు సంక్షేమం, అభివృద్ధికి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. రెండుసార్లు తన కుటుంబానికి ప్రజలు అండగా నిలిచారని, వారి రుణం తీర్చుకోలేనిదని చెప్పారు. తన శక్తివంచన లేకుండా నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరును తీసుకొస్తానని పేర్కొన్నారు.

సామాజిక న్యాయం ఏమిటో చేతల్లో..

సామాజిక న్యాయం ఏమిటో చేతల్లో..


వైఎస్ జగన్ తన పరిపాలనలో సామాజిక న్యాయం ఏమిటో ఆచరించి చూపారని డాక్టర్ సుధ అన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడి సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. ఆయన సుపరిపాలనను చూసి ప్రజలు తనను గెలిపించారని అన్నారు. 2019లో 44 వేల ఓట్ల మెజారిటీని ఇస్తే- ఇప్పుడు దానికి రెట్టింపు ఆధిక్యతతో పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. ప్రజలు జగన్ సార్ వెనుకే ఉన్నారనేది ఈ విజయంతో మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.

పార్టీ నేతలకు

ఇంత భారీ మెజారిటీతో తనను అసెంబ్లీకి పంపించిన బద్వేలు నియోజకవర్గం ఓటర్లకు పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నానని చెప్పారు. బద్వేలు నియోజకవర్గం ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన వైఎస్ జగన్‌, తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి, విజయం కష్టపడిన గోవిందరెడ్డి, కడప లోక్‌సభ సభ్యుడు అవినాష్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఆదిమూలపు సురేష్ వంటి నాయకులకు పాదాభివందనం చేస్తున్నానని అన్నారు.

 మౌలిక సదుపాయాలు.. సంక్షేమ పథకాల అమలు..

మౌలిక సదుపాయాలు.. సంక్షేమ పథకాల అమలు..

బద్వేలు నియోజకవర్గం ఎదుర్కొంటోన్న ప్రాథమిక అంశాల, సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తానని డాక్టర్ సుధ అన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం కేటాయించిన నిధుల్లో ప్రతి పైసాను అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని చెప్పారు. రోడ్ల అభివృద్ధి, మురుగునీటి పారుదల సౌకర్యాన్ని మెరుగుపర్చడం, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. ఏ సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+