జగన్, కేసీఆర్ దోస్తీ కటీఫ్..!?
ఢిల్లీ కేంద్రంగా జగన్ ధర్నా చేసారు. ఏపీలో దాడులకు నిరసనగా ఢిల్లీలో జగన్ పార్టీ శ్రేణులతో దీక్షకు దిగారు. అధికార మార్పిడి జరిగిన తరువాత చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆరోపించారు. జగన్ దీక్షకు ఇండి కూటమిలోని కాంగ్రెస్ మినహా ఇతర పక్షాలు మద్దతుగా నిలిచాయి. కానీ, బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించిన జగన్ కు ఇప్పుడు మద్దతు ఇవ్వక పోవటంతో కొత్త చర్చ మొదలైంది.
జగన్ ధర్నా వేళ
ఢిల్లీలో జగన్ ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు అయిన తరువాత దాడులు..దైర్జన్యాలతో పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పారు. బాధితుల పైనే కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. ఏపీలో శాంతిభద్రతలు లేవని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఢిల్లీలో ఆయన ఏపీలో చంద్రబాబు పాలన పైన సంచలన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.

జగన్ కు మద్దతుగా
జగన్ ధర్నాకు ఇండి కూటమిలో కాంగ్రెస్ మినహా కీలకంగా ఉన్న ముఖ్య పార్టీల నేతలు మద్దతుగా నిలిచారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్వయంగా పాల్గొన్నారు. అధికార మార్పిడి జరిగినంత మాత్రాన రాజకీయ దాడులు సరికాదన్నారు. ఎంఐఎం, టీఎంసీ, అన్నా డీఎంకే, జేఎంఎం, ఆప్, ఆల్ ఇండియా ముస్లింలీగ్, శివసేన(ఉద్దవ్) పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో వీసీకే పార్టీ నేతలు జగన్ ఇండి కూటమికి మద్దతు ఇవ్వటానికి సరైన సమయంగా పేర్కొన్నారు. ఇదే సమయంలో మరో చర్చ మొదలైంది.
బీఆర్ఎస్ దూరంగా
ఇన్ని పార్టీలు వచ్చి మద్దతు ప్రకటించినా..బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. 2019లో ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత తెలంగాణ సీఎంగా కేసీఆర్ తో సత్సంబంధాలు కొనసాగించారు. ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయిన తరువాత ఆయన ఆస్పత్రిలో ఉన్న సమయంలోనూ పరామర్శించారు. ఏపీలో ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తారని కేసీఆర్, కేటీఆర్ చెబుతూ వచ్చారు. ఫలితాల్లో వైసీపీ ఓటమితో అంత సంక్షేమం చేసిన జగన్ ఓడిపోవటం అర్దం కాలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంత సత్సంబంధాలు కొనసాగిస్తున్న వేళ జగన్ ధర్నాకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాకపోవటం చర్చకు కారణమవుతోంది. దీంతో, దీన పైన బీఆర్ఎస్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications