సీబీఐ విచారణకి నేను సిద్దం, మీరు సిద్దమా - చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్..!!

ఏపీ రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైసీపీ నిరసనలు కొనసాగిస్తోంది. ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా వివరణ ఇచ్చింది. మండలిలోనూ చర్చ జరగాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో జగన్ హయాంలో గ్రూపు-1 పరీక్షల్లోనూ అక్రమాలు జరిగాయని టీడీపీ ఆరోపిస్తోంది. వీటి పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. గ్రూపు -1 అక్రమాల పై సీబీఐ విచారణకు తాను సిద్దమని.. డీఎస్సీ పైనా సీబీఐ విచారణ చేయించటానికి చంద్రబాబు సిద్దమా అంటూ జగన్ సవాల్ చేసారు.

డీఎస్సీ లో అక్రమాల పైన మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తాము చేస్తున్న ఆరోపణలకు అనుగుణంగానే ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన వివరణలో అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏపీపీఎస్సీ గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో జగన్ హయాంలో అక్రమాలు జరిగాయని తాజాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఆరోపణలు చేసింది. దీని పైన స్పందించిన జగన్ తమ హయాలో ఎలాంటి అవకతవకలు జరగలేదనే అంశం.. చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ చెప్పుకొచ్చారు. అయినా, దుష్ప్రచారం ఆపటం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసారు. ఏపీపీఎస్సీ గ్రూపు-1 చంద్రబాబు హయాంలోనే నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పారు. ఎన్నికల ముందు హడావుడిగా ఆయన విడుదల చేసారని.. తాము అధికారం చేపట్టకముందే ప్రిలిమ్స్ పూర్తయ్యాయని చెప్పారు. అందు లో పాస్ అయిన వారికి మెయిన్, ఇంటర్వ్యూలు నిర్వహించామని వివరించారు.

పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!
పాఠశాలలకు, కార్యాలయాలకు వరలక్ష్మీ వ్రతం సెలవు- తాజా ఉత్తర్వులు..!!
ysrcp-chief-ys-jagan-challenges-chandrababu-to-cbi-probe-into-dsc-recruitment-group-1-exams

ప్రధానికి జగన్ లేఖ

గ్రూపు-1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని చంద్రబాబు వేసిన సిట్ తేల్చిందని జగన్ పేర్కొన్నారు. వాల్యుయేషన్ లో ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పినట్లు వివరించారు. అయినా, తప్పుడు ప్రచారాలు చేసారన్నారు. గ్రూపు- పరీక్ష నిర్వహణ పైన సీబీఐ విచారణకు తాను రెడీ అని జగన్ ప్రకటించారు. 2025 డీఎస్సీ పై విచారణకు చంద్రబాబు సిద్దమా అని జగన్ సవాల్ చేసారు. ఈ రెండింటి పైనా సిబీఐ విచారణ కోరుతూ ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. తాము తప్పు చేయలేదు కాబట్టే ధైర్యంగా విచారణ కోరుతున్నామని చెప్పుకొచ్చారు. స్పోర్స్ట్ కోటాలో అసెంబ్లీ వేదికగా లోకేష్ చేసిన ప్రసంగంలో అంశాలను జగన్ ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోటాలో తమ పార్టీ నేతల లేఖల ఆధారంగా తమ వారికి ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. తన కుమారుడిని కాపాడుకోవటం కోసం సీఎం చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. డీఎస్సీ అక్రమాల పై సీబీఐ విచారణ కోరుతూ ప్రధానికి లేఖ రాసినట్లు జగన్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+