వైసీపీ నుంచి 4 వేల కోట్ల వసూలుకు ఏపీ హైకోర్టులో పిటిషన్- ఎందుకో తెలుసా ?
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు... ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడం మొదలుపెట్టింది. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా లెక్కచేయలేదు. చివరికి హైకోర్టు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టినా సుప్రీంకోర్టులో వైసీపీ దాన్ని సవాలు చేసింది. చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీ రంగులు తొలగించక తప్పలేదు. చివరికి వైసీపీ రంగులు వేసి, తీయడం ద్వారా ప్రజాధనం భారీగా వృధా అయింది.
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో తొలగించడం ద్వారా రూ.4 వేల కోట్లు ఖర్చయిందని, ఇదంతా ప్రజాధనం వృధాయేనని, దీన్ని వైసీపీ నుంచి రాబట్టాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వైసీపీ నుంచి రూ.4 వేల కోట్ల రూపాయలను వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. ఈ కేసులో సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణను ప్రతివాదులుగా చేర్చారు.

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి తొలగించిన వ్యవహారంపై దాఖలైన కేసును పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం... సీఎస్, మంత్రులను వ్యక్తిగతంగా ఎందుకు ప్రతివాదులుగా చేర్చారని ఆక్షేపించింది. దీంతో ఈ కేసులో అఫిడవిట్ సరిగా వేయాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వైసీపీ రంగులు వేస్తే తిరిగి ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లను ఖజానాకు జమ చేయాలని కోరడంలో స్పష్టత లోపించిందని హైకోర్టు పేర్కొంది. దీంతో పిటిషనర్ త్వరలో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు.
-
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications