పిన్నెల్లి ఎపిసోడ్ పై వైసీపీ ఎదురుదాడి-హైకోర్టుకు వెళ్తామని ఈసీకి హెచ్చరిక !
ఏపీలోని మాచర్ల నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ఈసీ.. పిన్నెల్లితో పాటు బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించింది. దీంతో హైదరాబాద్ తెలంగాణలో దాక్కున్న పిన్నెల్లిని ఇవాళ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై వైసీపీ తొలిసారి స్పందించింది.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదు చేసిన కేసులపై స్పందించిన గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.. రిగ్గింగ్ చేసినోళ్లను వదిలేసి ప్రతిఘటించినోళ్లపై కేసులు కడతారా అంటూ ప్రశ్నించారు. పాల్వాయిగేట్‌లో టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నది నిజమన్నారు. తమ ఏజెంట్లను బయటకులాగి దాడి చేసినందునే పిన్నెల్లి అక్కడ ప్రతిఘటించారన్నారు.టీడీపీ నేతల రిగ్గింగ్‌ను సమర్ధించి పిన్నెల్లిపై కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని కాసు ప్రశ్నించారు.

అక్రమకేసులతో భయపెట్టి మాచర్లలో పిన్నెల్లి గెలుపును ఎవరూ ఆపలేరని కాసు మహేష్ తెలిపారు. అలాగే ఈవీఎంల ధ్వంసాలపై వీడియోలన్నీ ఎన్నికల కమిషన్ బయట పెట్టాల్సిందేనని కాసు డిమాండ్ చేశారు. పాల్వాయిగేట్ వీడియో ఒక్కటే లీక్‌చేయడం ఎన్నికల కమిషన్ పక్షపాతధోరణి కాదా అని ప్రశ్నించారు. టీడీపీ దౌర్జన్యాల వీడియోల్ని మీరెందుకు బయటపెట్టడం లేదన్నారు.
రిగ్గింగ్ ఎక్కడా జరగలేదని ఎన్నికల కమిషన్ నిరూపించుకోవాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే రీపోలింగ్ పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ నియమించిన ఐఏఎస్, ఐపీఎస్‌లే సస్పెండ్ అయ్యారంటే.. విఫలమెవరిదో తేల్చాలని కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. రీపోలింగ్‌పై ఎన్నికల కమిషన్ స్పందించకుంటే అభ్యర్థులుగా మేం హైకోర్టుకెళ్లి పోరాడతామన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications