ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యగానికి సంబంధించి పార్టీ కీలక ప్రకటన చేసింది. పవన్ కల్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఓ ప్రకటన విడుదల చేశారు.పవన్ కల్యాణ్ జర్వంతో బాధపడుతున్నారు. అంతేకాదు ఆయన ఊపరితిత్తుల్లో నిమ్ము చేరింది. దీంతో శ్వాస తీసుకోవడంలో పవన్ ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం సహకరించనప్పటికీ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. తనకు జ్వరం వస్తున్న నేపథ్యంలో జనసేన శ్రేణులు, కార్యకర్తలకు పవన్ కీలక విజ్ఞప్తి చేశారు.

గజమాలాలు ఏర్పాటు చేయొద్దని.. అలాగే పూలు చల్లొద్దని పవన్ సూచించారు.కాగా పవన్ కల్యాణ్ గతంలోనూ జ్వరంతో బాధపడ్డారు. అయితే హైదరాబాద్‌లో చికిత్స తీసుకుని పిఠాపురం నుంచి విజయభేరీ యాత్రను కొనసాగించారు. ప్రస్తుతం మళ్లీ జ్వరంతో బాధపడుతుండటంతో జనసేన శ్రేణులు, కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. తాజాగా పవన్ ఆరోగ్యంపై అధికార వైసీపీ సోషల్ మీడియా స్పందించింది. తమ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేయడం జరిగింది.

ysrcp counter to janasena chief pawan kalyan health issues

జనసేన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ పవన్ ఆరోగ్యంపై విమర్శలు చేశారు. తమ ట్వీట్‌లో పవన్ ఆరోగ్యాన్ని ఉద్దేశిస్తూ..వచ్చాడండి ఫ్లవర్ స్టార్.. నాలుగురోజులు ఎండలో తిరిగితే జొరం వస్తుంది.. అభిమానులు పూలు వేస్తే ఎలర్జీ వస్తుంది. అలాంటి మీరు ఎండనక వాననకా ప్రజల్లో తిరిగే సీఎం వైఎస్ జగన్ గారి మీద జరిగిన దాడిని గులకరాయి అని హేళన చేస్తావా? రెండ్రోజులు ప్రజల్లో ఉండలేని నీకు... జొరం వస్తే ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ పారిపోయే నీకు రాజకీయాలెందుకు? పోయి రిసార్టులో రెస్ట్ తీసుకో.. కార్యకర్తలకు, ప్రజలకు మీ బాధ తప్పుతుందంటూ తమ ట్వీట్‌లో ఈ విధంగా రాసుకొచ్చింది. తమ నాయకుడు ఆరోగ్యంపై అధికార పార్టీ స్పందించిన తీరుపై పవన్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+