మానవ అక్రమరవాణా ఇదేనా? ఒకే ఒక్క ఫొటోతో పవన్‌కళ్యాణ్‌కు వైసీపీ కౌంటర్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా పవన్ కళ్యాణ్ రెండవ విడత వారాహి విజయయాత్రలో వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తీరుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున వాలంటీర్లు పవన్ కళ్యాణ్ శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహిస్తున్నారు. వాలంటీర్ల పై పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకుని పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు తమకు క్షమాపణ చెప్పకపోతే సరైన బుద్ధి చెబుతామని మహిళా వాలంటీర్లు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాంగోపాల్ వర్మ వాలంటీర్లు పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటూ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. ఇక ఏపీ మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని నోటీసులు పంపించింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఒకే ఫోటోతో వైసిపి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు అందిస్తున్న సమాచారంతోనే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఒకే ఒక ఫోటోతో సమాధానం చెప్పారు. వర్షాలు, వరదలు వచ్చిన సమయంలో గ్రామ వాలంటీర్లు నడుము లోతు నీళ్లలో ఇంటింటికి వెళ్లి నిత్యావసర వస్తువులను అందించిన విషయం తెలిసిందే.

ఇక నడుము లోతు నీళ్లలో ఇంటింటికి వెళ్లి నిత్యావసరాలను అందించిన ఒక ఫోటోను సోషల్ మీడియాలో వైసిపి పోస్ట్ చేసింది. ఈ పోస్టు ద్వారా మానవ అక్రమ రవాణా అంటే ఇదేనా అంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలకు వైసిపి ఒకే ఒక్క ఫోటోతో దీటుగా సమాధానం చెప్పిందని జగన్ అభిమానులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications