అసెంబ్లీ సెషన్స్ బహిష్కరణకు వైసీపీ నిర్ణయం: 21 మంది ఎమ్మెల్యేలపై వేటుకు డిమాండ్

Posted By:
Subscribe to Oneindia Telugu
  అసెంబ్లీ సెషన్స్ బహిష్కరణకు వైసీపీ నిర్ణయం | Oneindia Telugu

  అమరావతి: వచ్చే నెల 8వ, తేది నుండి ప్రారంభం కానున్న ఏపీ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ శాసనసభపక్షం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు గురువారం నాడు జరిగిన శాసనసభపక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు వైసీపీ వర్గాలు ప్రకటించాయి.

  వచ్చే నెల 6వ, తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి రెండు రోజుల ముందే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ స్పీకర్‌కు గతంలోనే ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్టు గతంలోనే స్పీకర్ ప్రకటించారు.

  అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం

  అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ నిర్ణయం

  వచ్చే నెల 8వ, తేది నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ శాసనసభపక్షసమావేశం నిర్ణయం తీసుకొంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోనందుకు నిరసగా వైసీపీ శాసనసభపక్షం ఈ నిర్ణయం తీసుకొంది.

   మంత్రి పదవులు కేటాయించడంపై మండిపాటు

  మంత్రి పదవులు కేటాయించడంపై మండిపాటు

  వైసీపీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవడంపై వైసీపీ నాయకత్వం తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేసింది. మంత్రులుగా బాధ్యతలు తీసుకొన్న నలుగురిని భర్తరప్ చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు.

   శాశ్వతంగా అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ?

  శాశ్వతంగా అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ?

  ఏపీ అసెంబ్లీ సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించాలనే యోచనలో కూడ వైసీపీ ఉందని సమాచారం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 1989 నుండి 1994 మధ్య కాలంలో అసెంబ్లీ సమావేశాలను తాను హజరుకాబోనని అప్పటి విపక్ష నేత ఎన్టీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హజరుకాలేదు. తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకోవడం ఎన్టీఆర్‌ ఆదర్శంగా ఉన్నారని వైసీపీ నేతలు గుర్తుచేశారు.

  పాదయాత్రను అడ్డుకొనేందుకే అసెంబ్లీ సమావేశాలు

  పాదయాత్రను అడ్డుకొనేందుకే అసెంబ్లీ సమావేశాలు

  పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం పట్ల వైసీపీ నాయకత్వం అంతర్గత సమావేశాల్లో అభిప్రాయపడుతోంది.. వైసీపీ శాసనసభపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ఉన్న సమయంలో అసెంబ్లీకి హజరయ్యే అవకాశం లేదు. దీంతో పాదయాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం, ఎమ్మెల్యేలు కేంద్రికరించాల్సి ఉంటుంది. దరిమిలా వైసీపీ నాయకత్వం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ysrcp decided to boycott Ap Assembly session on Thursday.Ysrclp meeting held at Hyderabad on Thursday. Ysrclp made allegations on Ap Speaker Dr. Kodela sivaprasada Rao.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి