హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీకి ఫిరాయింపు ఎమ్మెల్యేలు: విప్‌ను ధిక్కరించి జగన్‌కు షాకిస్తారా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు ప్రారంభమయ్యాయి. చివరి రోజైన ఈరోజు అసంబ్లీ సమావేశాల్లో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రవ్య వినిమయ బిల్లుపై జరగనున్న ఓటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలంటూ వైసీపీ జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆ పార్టీ నుంచి టీడీపీలోకి చేరిన 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వారిలో భూమా నాగిరెడ్డి, భూమా అఖిల ప్రియ, కలమట వెంకట నారాయణ, డేవిడ్ రాజు, మణిగాంధీ, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు.

ysrcp defections mlas not attended for last day assembly

అయితే తాము అనారోగ్యంగా ఉన్నామంటూ జలీల్ ఖాన్, జయరాములు చివరి రోజైన బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. తన పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే క్రమంలో జగన్ ఓటింగ్‌కు హాజరుకావాలని విప్ జారీ చేశారు.

ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బుధవారం ఓటింగ్‌కు హాజరుకాని పక్షంలో వారిపై చర్యలకు జగన్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో అనారోగ్యం కారణంగానే తాము సభకు హాజరు కాలేకపోయినట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు లేఖల ద్వారా తెలిపారు.

ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన జ్యోతుల నెహ్రూ, వరుపుల సైతం అసెంబ్లీ సమావేశాలకు వస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కావడంతో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టింది. ఇదిలా ఉండే ద్రవ్యవినిమయ బిల్లు ఓటింగ్‌కు హాజరైన ఎమ్మెల్యేలు ఎవరి పక్షాన నిలబడతారన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

English summary
ysrcp defections mlas not attended for last day assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X