ఏపీలో రాష్ట్రపతి పాలన ?-అంబటి, జోగి ఇళ్ల దాడితో వైసీపీ..!
ఏపీలో తిరుమల లడ్డూకు వాడిన కల్తీ నెయ్యి వివాదంపై సిట్ రిపోర్ట్ తర్వాత కూటమికీ, వైఎస్సార్సీపీ (ysrcp)కి మధ్య తీవ్ర మాటల యుద్దం సాగుతోంది. ఇది కాస్తా నిన్న దాడుల వరకూ వచ్చేసింది. చంద్రబాబుపై వ్యాఖ్యల నేపథ్యంలో నిన్న గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడికి దిగితే.. ఇవాళ లోకేష్ పై వ్యాఖ్యలతో ఇవాళ ఇబ్రహీంపట్నంలో మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై దాడి జరిగింది. ఈ రెండు దాడులతో వైసీపీ భగ్గుమంటోంది.
రాష్ట్రంలో బీహార్ తరహా పాలనకు కూటమి ప్రభుత్వం తెరతీసిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో అభివృద్ది పూర్తిగా కుంటుపడగా... శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆయన మండిపడ్డారు. వరుసగా వైయస్సారీపీకి చెందిన ముగ్గురు మాజీ మంత్రుల, మాజీ ఎమ్మెల్యేల ఇంటిపై అధికార పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. లా అండ్ ఆర్డర్ నాశనం చేస్తున్న వారిని అదుపుచేయాల్సిన బాధ్యత పోలీసులదే. చంద్రబాబు, లోకేష్ అండదండలతో రాష్ట్రంలో టీడీపీ గూండాలు రౌడీయిజంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని.. రాష్ట్రపతి పాలన విధించాలన్నారు

మరో మాజీ మంత్రి పేర్నినాని కూడా రెండు రోజులుగా తన సహచర నేతలు, మాజీ మంత్రుల ఇళ్లపై జరుగుతున్న దాడులపై ఫైర్ అయ్యారు. గత కొన్ని రోజులుగా ఆంధ్రరాష్ట్రంలో పరిస్థితులు ఘోరంగా తయారయ్యాయని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలు ఇస్తారు, లోకేష్, డీజీపీ, ఇతర అధికారులు అమలుచేస్తున్నారన్నారు. ఇవాళ జోగి రమేశ్ ఇంటిపై టీడీపీ గుండాలు కర్రలు, రాళ్లు చేతపట్టి ఆటవిక మూకల మాదిరిగా దాడులు చేశారన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని, దాడులు జరుగుతున్నా చూస్తూ ఉండిపోయారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని, వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications