లోకేష్ తో ఎమ్మెల్యే మేకపాటి భేటీ-అటు ఆనం, కోటంరెడ్డితో టీడీపీ నేతల చర్చల వేళ..
ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో రాజకీయంగా నేతలు తమ భవిష్యత్తు దిశగా వేగంగా అడుగులేస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు వరుసగా టీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాకు చెందిన వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఇప్పటికే టీడీపీ నేతలు సమావేశమై చర్చలు జరుపుతుండగా.. అదే సమయంలో లోకేష్ తో మరో ఎమ్మెల్యే మేకపాటి భేటీ అయ్యారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలులో పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ ను ఇవాళ ఉదయగిరికి చెందిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ చర్చించారు. మరికొన్ని రోజుల్లో లోకేష్ పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో ముగ్గురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి, మేకపాటి టీడీపీ తీర్ధం పుచ్చుకోబోతున్నారు.

ఇవాళ బద్వేలులో లోకేష్ పాదయాత్ర చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయనతో క్యాంపు ఏర్పాటు చేసిన ప్రాంతంలో భేటీ అయ్యారు. టీడీపీలో చేరికపై తన అభిప్రాయాన్ని మేకపాటి లోకేష్ కు వెల్లడించినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఎంట్రీ అయిన తర్వాత టీడీపీలో చేరే అంశంపై లోకేష్ తో మేకపాటి చర్చించినట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లాలో నెలకొన్న పరిస్దితులపైనా ఆయన లోకేష్ కు వివరించినట్లు తెలుస్తోంది.
లోకేష్ తో ఎమ్మెల్యే మేకపాటి భేటీ-అటు ఆనం, కోటంరెడ్డితో టీడీపీ నేతల చర్చల వేళ..!!#NaraLokesh #MekapatiChandrasekharReddy #AnamRamanarayanaReddy #KotamreddySridharReddy #TDP #Oneindiatelugu pic.twitter.com/PDEV2vnALS
— oneindiatelugu (@oneindiatelugu) June 10, 2023
మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో టీడీపీకి తిరిగి పునర్వైభవం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. అదే రోజు వీరితో పాటు భారీ ఎత్తున ఇతర నేతలు కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications