పోస్టల్ బ్యాలెట్ పై వైసీపీ కీలక నిర్ణయం - కలిసొచ్చేనా..!!
ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పైన కొనసాగుతున్న వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల సీఈవో టీడీపీ ఫిర్యాదు మేరకు జారీ చేసిన మెమో పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీని పైన కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కానీ, అనుకూలంగా ఫలితం రాలేదు. దీంతో..హైకోర్టులో ఇదే అంశం పైన వైసీపీ లంచ్ మోషన్ పిటషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.
వైసీపీ అభ్యంతరం
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఈసీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా సీఈవో ఎంకే మీనా మెమో ఇవ్వడంపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఈవో మెమోపై వైసీపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసర విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది. సీఈవో జారీ చేసిన మెమో ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్దంగా ఉందని పిటీషన్ లో పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఆర్వో సీల్ లేకపోయినా లెక్కింపులోకి పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవటం పైన వైసీపీ విభేదిస్తోంది.

వైసీపీ అభ్యంరతం
పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ ఆఫీసర్ సంతకంతోపాటు సీలు ఉంటేనే అది చెల్లుబాటు అవుతుందనే నిబంధన ఉంది. దేశవ్యాప్తంగా ఇదే నిబంధన ఉంటే.. ఏపీలో మాత్రం వెసులుబాటు ఇచ్చారు ప్రధాన ఎన్నికల అధికారి, సీల్ లేకపోయినా బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందన్నారు. ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. టీడీపీ ఫిర్యాదు చేయడం వల్లే వారికి అనుకూలంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. గెజిటెడ్ అధికారి సీల్, హోదా వివరాలు లేకపోయినా.. పోస్టల్ బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఏపీ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టులో విచారణ
సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ నేతలంటున్నారు. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. రాష్ట్ర ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదుకు సానుకూల స్పందన రాలేదు. దీంతో..హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఏపీలో 5,39,189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. ఫలితంలో కీలకంగా మారనున్నాయి.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications