Nara Lokesh : లోకేష్ పాదయాత్రపై రిపోర్ట్స్- వైసీపీ అలర్ట్-వరుస ట్వీట్ల వెనుక ?
ఏపీలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అనంతరం ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే ఈ పాదయాత్రపై కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు ఒక్కసారిగా జూలు విదుల్చుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి లోకేష్ యాత్రను టార్గెట్ చేస్తూ పెడుతున్న వరుస ట్వీట్లపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
నారా లోకేష్ పాదయాత్ర జనవరిలో తన తండ్రి చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ప్రారంభమైనప్పుడు దీనికి పోలీసుల నుంచి అడ్డంకులు ఎదురయ్యాయి. అప్పట్లో అనుమతుల పేరుతో కొన్ని రోజులు, రోడ్లపై బహిరంగసభలకు ఆటంకాలతో సాగింది. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంతో పాటు పోలీసులు కూడా దీన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇన్నాళ్లూ యాత్ర అలా సాగిపోతోంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొదలుపెట్టాక లోకేష్ పాదయాత్రతో పోలుస్తూ తేలిపోతోందంటూ కొందరు విమర్శలు కూడా చేశారు. కానీ వైసీపీ నేతలు పవన్ నే ఎక్కువగా టార్గెట్ చేశారు.

కానీ ఇప్పుడు మరోసారి వైసీపీ నేతలు లోకేష్ పాదయాత్రను టార్గెట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి అడుగుపెట్టే క్రమంలో వైసీపీ విమర్శల దాడి ఎక్కువైంది. గత కొంతకాలంగా లోకేష్ పై ఎక్కువగా ట్వీట్లు పెట్టని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. అదే సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ఇతర వైసీపీ నేతలు కూడా ట్వీట్లలో లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో వైసీపీ తిరిగి యాక్టివ్ కావడం వెనుక ఏముందనే చర్చ సాగుతోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీకి కూడా కాస్తో కూస్తో బలం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత కరణం బలరాం వైసీపీవైపు మొగ్గినా స్వామి, గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు మాత్రం ఇంకా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.

అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో టీడీపీ పరిస్ధితి కాస్త మెరుగుపడిందని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో లోకేష్ పాదయాత్రకు జనం కూడా భారీగానే వస్తున్నారు. దీంతో స్ధానికంగా అందుతున్న నిఘా నివేదికల ఆధారంగా వైసీపీ తిరిగి లోకేష్ యాత్రను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications