Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అరెస్టుల్లో చింతమనేని రికార్డులు -ఫైర్ బ్రాండ్ లీడర్ పై వైసీపీ కక్ష తీరలేదా-భవిష్యత్ వ్యూహమేనా ?

టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతల్లో ఒకరిగా పేరు పొందిన పశ్చిమగోదావరి జిల్లా నాయకుడు చింతమనేని ప్రభాకర్ ను వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఆయన అరెస్టు కావడం, పోలీసు స్టేషన్లకు వెళ్లడం, జైలుకెళ్లడం, తిరిగి బెయిళ్లపై బయటికి రావడం పరిపాటిగా మారిపోయింది. ఏపీ రాజకీయాల్లో ఇంత రికార్డు స్దాయిలో అరెస్టులు అయిన నేత కూడా మరొకరు ఉండి ఉండరు. తాజాగా మరోసారి విశాఖ మన్యంలో ఆయన్ను అరెస్టు చేసిన వైసీపీ సర్కార్.. 24 గంటలు గడవకముందే భీమడోలు పీఎస్ నుంచి స్టేషన్ బెయిల్ పై బయటికి పంపేసింది. దీంతో వైసీపీ అరెస్టుల వ్యూహంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

పశ్చిమలో చింతమనేని హవా

పశ్చిమలో చింతమనేని హవా


పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో గారపాటి సాంబశివరావు శిష్యుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన చింతమనేని ప్రభాకర్ ఆ తర్వాత అస్సలు వెనుదిరిగి చూసుకోలేదు. జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో వరుస విజయాలతో టీడీపీలో సీనియర్ నేతగా ఎదిగిపోయారు. అన్నింటికీ మించి టీడీపీకి ఒకప్పుడు జిల్లాలో కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రులు కోటగిరి విద్యాధరరావు, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు ప్రజారాజ్యంలోకి ఫిరాయించాక చింతమనేని వంటి వారు పెద్దదిక్కుగా మారిపోయారు. కమ్మ సామాజిక వర్గం కావడం, నోటితోనే ప్రత్యర్ధుల్ని శాసించే స్ధాయిలో రాజకీయాలు చేయడం చింతమనేనిని పశ్చిమ రాజకీయాల్లో కీలక నేతగా మార్చేసింది. 2019 ఎన్నికల వరకూ ఇదే పరిస్దితి.

టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేత

టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేత

టీడీపీ ప్రస్ధానం నుంచి చూస్తే ఫైర్ బ్రాండ్ నేతలకు కొదవేమీ లేదు. అయినా చింతమనేనిది మరో దారి. తన దారికి అడ్డొచ్చే ఎవరినీ వదిలిపెట్టని నైజం. కనుసైగతోనే జిల్లా రాజకీయాల్ని శాసించే ధైర్యం. అన్నింటికీ మించి అంగబలం, అర్ధబలం. అయినా చంద్రబాబు ప్రభుత్వాల్లో మాత్రం ఆయన మంత్రి కాలేకపోయారు. దీనికి ప్రధాన కారణం ఆయన నోరే. దురుసు ప్రవర్తనతో చాలా సార్లు ప్రత్యర్ధులనే కాక సొంత పార్టీ టీడీపీని సైతం ఆయన ఇరుకునపెట్టేవారు. దీంతో ఫైర్ బ్రాండ్ నేత అయినప్పటికీ, ప్రత్యర్ధులకు సింహస్వప్నం అయినప్పటికీ చింతమనేనికి మంత్రి పదవి దక్కలేదు. 2019లో వైసీపీ హవాలో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోవడంతో చింతమనేని హవా కాస్త తగ్గింది.

ఎస్సీలపై వ్యాఖ్యలతో చేటు

ఎస్సీలపై వ్యాఖ్యలతో చేటు

తన నియోజకవర్గంలో పర్యటించే సమయంలో ఎస్సీలపై చింతమనేని ప్రభాకర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనకు ఓటర్లను దూరం చేశాయి. నియోజకవర్గంలో అన్ని వర్గాల్నీ కలుపుకుని పోతూనే, వారిపై ఆధిపత్యం చెలాయిస్తారని పేరున్న చింతమనేనిని వైసీపీ సోషల్ మీడియాతో దెబ్బకొట్టింది. ఆయన ఎస్సీలపై యథాలాపంగా చేసిన వ్యాఖ్యల్ని హైలెట్ చేయడం ద్వారా చింతమనేనిని ఎస్సీలకు దూరం చేసింది. ఎస్సీలకు రాజకీయాలెందుకంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు 2019 ఎన్నికల్లో గట్టిగానే ప్రభావం చూపాయి. దీంతో ఆయన తొలిసారి పరాజయం రుచిచూశారు. అయితే ఓటమి ఓ భారమైతే ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ పెట్టిన కేసులు ఆయనకు మరో తలనొప్పిగా మారిపోయాయి.

రికార్డు స్ధాయిలో అరెస్టులు

రికార్డు స్ధాయిలో అరెస్టులు

ఎస్సీలపై వ్యాఖ్యల కేసులో అట్రాసిటీ చట్టం కింద వైసీపీ సర్కార్ లో తొలిసారి అరెస్టు అయిన చింతమనేనిపై పోలీసులు ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా ఆయన ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఆయన కొంతకాలం పాటు ఏదో ఒక కేసులో జైల్లో ఉండటం మామూలైపోయింది. మొదట్లో కేసుల్ని సీరియస్ గా తీసుకున్న చింతమనేనికి ఆ తర్వాత ఈ వ్యవహారం లైట్ అయిపోయింది. చివరికి కరోనా నిబంధనల ఉల్లంఘన కేసులోనూ జైలుకు వెళ్లిన ఆయన కొంతకాలానికి తిరిగొచ్చారు. పోలీసులు వరుసగా వేధిస్తున్నా, రికార్డు స్దాయిలో కేసుల నమోదు, అరెస్టులు చేస్తున్నా ఇప్పుడు చింతమనేని అన్నీ మౌనంగా భరిస్తున్నారు. తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

Recommended Video

    5.1 తీవ్రతతో Earthquake.. AP, Tamil Nadu లోని పలు ప్రాంతాల్లో కంపించిన భూమి..! || Oneindia Telugu
    చింతమనేని టార్గెట్ వెనుక వైసీపీ వ్యూహమిదే ?

    చింతమనేని టార్గెట్ వెనుక వైసీపీ వ్యూహమిదే ?

    వైసీపీ సర్కార్ లోనే కాదు ఏపీ చరిత్రలోనే చింతమనేని ప్రభాకర్ లా ఇన్నిసార్లు అరెస్టు అయి జైలుకు వెళ్లిన నేత మరొకరు కనిపించరు. అయినా వైసీపీ కసి చల్లారినట్లు కనిపించడం లేదు. తాజాగా విశాఖ మన్యంలో అనుమాస్పదంగా సంచరిస్తున్నారంటూ ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇవాళ స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇంటికి పంపేశారు. దీంతో అసలు వైసీపీ సర్కార్ చింతమనేనిని ఇంతగా టార్గెట్ చేయడానికి వెనుక గల కారణాలపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. వైసీపీ అంటేనే మండిపడే చింతమనేనిని ఎక్కువసార్లు జైలుకు పంపడం ద్వారా కక్షతీర్చుకోవడం అసలు కారణం కాదని తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా టీడీపీలో చింతమనేనిని మించి కేసుల్ని ఎదుర్కొనే, ఆర్ధికంగా నిలదొక్కుకునే నేత మరొకరు కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ సర్కార్ కేసులకు భయపడి మిగతా నేతలు మాట్లాడటమే మానేసిన పరిస్ధితి. దీంతో వచ్చే ఎన్నికల్లో చింతమనేని ఆధ్వర్యంలోనే టీడీపీ జిల్లాలో ఎన్నికలు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి చెక్ పెట్టాలంటే ఎన్నికల నాటికి ఇప్పటివరకూ ఆయనపై పెట్టిన ఏదో ఒక కేసులో ఆయన్ను జైలుకు పంపాల్సిందేనని వైసీపీ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా టీడీపీ శ్రేణులకు ఆయన అండ లేకుండా చేయాలన్న వ్యూహం కనిపిస్తోంది. అయితే ఈ కేసుల పరంపర ఆయన్ను అడ్డుకుంటుందా లేదో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+