Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలయ్య కు వైసీపీ ఘాటు కౌంటర్ ..! మెంటల్ సర్టిఫికెట్ ఎవరిది?

ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయంలో ఇవాళ ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అదీ అసెంబ్లీ సమావేశాల వేదికగా. అసెంబ్లీలో వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో జగన్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, దానిపై స్పందించే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విమర్శలపై వైసీపీ ఎక్స్ లో ఘాటు కౌంటర్ ఇచ్చింది.

ముందుగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ సినీ పరిశ్రమను తన వద్దకు ఎలా రప్పించుకున్నారో వివరించే క్రమంలో చిరంజీవిని ఇందులోకి లాగారు. చిరంజీవిని రప్పించుకుని అవమానించారని, ఆ తర్వాత చిరంజీవి ఒత్తిడి చేస్తే జగన్ దిగొచ్చారంటూ వ్యాఖ్యానించారు. మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్రనటుల్ని కూడా జగన్ ఎలా రప్పించారో కామినేని చెప్పుకొచ్చారు. అలా అప్పట్లో సీన్ బై సీన్ ఎలా ఏం జరిగిందో అసెంబ్లీలో కామినేని సమగ్రంగా వివరించారు.

YSRCP Hits Back at Balakrishna s Psycho Remark With Mental Certificate Jibe

అయితే ఇందులో చిరంజీవి గట్టిగా చెప్తే జగన్ దిగి వచ్చారంటూ కామినేని చేసిన వ్యాఖ్యలు బాలయ్యకు ఆగ్రహం తెప్పించాయి. దీనిపై కామినేని మాట్లాడటం పూర్తి కాగానే లేచిన బాలయ్య.. ఆ వ్యాఖ్యలు అబద్దమని సభలోనే తేల్చిచెప్పేశారు. అప్పట్లో సైకో (జగన్ ) దగ్గరికి ఎవరో బలవంతపెడితే చిరంజీవి రాలేదని, ఇండస్త్రీ తరఫునే వచ్చారంటూ వెల్లడించారు. అయితే బాలయ్య జగన్ ను సైతో అని విమర్శించడం వివాదాస్పదమైంది.

YSRCP Hits Back at Balakrishna s Psycho Remark With Mental Certificate Jibe

దీనిపై వైసీపీ ఎక్స్ లో ఘాటుగా స్పందించింది. బాలయ్యకు గతాన్ని గుర్తుచేసింది. ఎక్కడా బాలయ్య పేరెత్తకుండానే ఆయన గతాన్ని గుర్తుచేస్తూ ట్వీట్ చేసింది. "రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న. తన ఇంట్లో ఒక సినిమా నిర్మాతపైన, తన ఆస్థాన జ్యోతిష్యుడిపైనా తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు? ఈ కేసునుంచి తప్పించుకోవడానికి తనకు మానసిక స్థితి బాగోలేదంటూ మెంటల్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకున్నది ఎవరు?" అంటూ వైసీపీ ప్రశ్నలు గుప్పించింది. ఇవి బాలయ్యను ఉద్దేశించి వేసిన ప్రశ్నలేనని అందరికీ అర్థమవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+