ప్రసన్న వ్యాఖ్యల్లో తప్పులేదు-వేమిరెడ్డి జంటపై మర్డర్ కేసు..! వైసీపీ ఫిర్యాదు..!

ఏపీలో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యేకు, సిట్టింగ్ ఎమ్మెల్యేకూ మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కాస్తా శృతిమించడంతో నిన్నటి నుంచి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన విమర్శలు చర్చనీయాంశమయ్యాయి. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని బెదిరించి ఆమె పెళ్లి చేసుకున్నారంటూ ప్రసన్న చేసిన కామెంట్స్ తర్వాత ఆయన ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు.

ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు ఇవాళ్టి వరకూ ఏ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి ఎస్పీని ఆశ్రయించారు. ఈ మేరకు నెల్లూరు ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి .. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డిపై హత్య కేసు పెట్టాలని ఫిర్యాదు చేశారు.

ysrcp justified prasannakumar reddy remarks demanded murder case against vemireddy couple

దాడిపై నిన్ననే పిర్యాదు చేశామని, ఇప్పటి వరకూ పోలీసుల నుండి ఎలాంటి స్పందనా లేదని వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదన్నారు. ఇది ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నమని, విమర్శలలో ఎదైన అభ్యంతరం వుంటే చట్టపరంగా వెళ్ళాలని సూచించారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమి మాట్లాడాడు...?వేమిరెడ్డిని జాగ్రత్తగా వుండాలి అని సూచించారని గుర్తుచేశారు.

ysrcp justified prasannakumar reddy remarks demanded murder case against vemireddy couple

రోజాపై గతంలో టీడీపీ చేసిన వ్యాఖ్యలు ఏమైయ్యాయని అనిల్ యాదవ్ ప్రశ్నించారు. ఒక మహిళా ఎమ్మెల్యే మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను వాడు వీడు అని మాట్లాడొచ్చా అని ఆయన నిలదీశారు. డబ్బుంది కాబట్టి డబ్బున్నోళ్లు అన్నం దాంట్లో తప్పేముందన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలను తప్పుగా ఆలోచిస్తున్నారు కాబట్టే మీకు అలా అర్థం అవుతున్నాయని ప్రత్యర్థులపై మండిపడ్డారు. నిన్న దాడిలో పాల్గొన్న వారితో పాటు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు కట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+