పథకాలు ఒకరివి.. స్టిక్కర్లు, సోకులు నారా లోకేష్‌వి

YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించి, అమలు చేసిన సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- బీజేపీ సంకీర్ణ కూటమి పేర్లు మార్చడంపై రాజకీయ రగడ రాజుకుంది.

పేర్లు మార్చడాన్ని వైఎస్ఆర్సీపీ తప్పు పట్టింది. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం పేర్లు మార్చగానే అన్నీ జరిగిపోయినట్టుగా వ్యవహరిస్తోందంటూ ఎద్దేవా చేసింది. ఈ విషయంలో నారా లోకేష్ ఇచ్చే బిల్డప్‌లు మామూలుగా లేవంటూ చురకలు అంటించింది.

YSRCP lashes out at Minister Nara Lokesh over the renaming of the Government schemes

పథకాలకు గొప్ప వాళ్ల పేర్లు పెడితేనే సరిపోదని, వాటిని నిస్పక్షపాతంగా అమలు చేయాల్సి ఉంటుందని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ఇప్పటికే హామీలన్నింటినీ నీరుగార్చారని, ఇక తమ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న పథకాలను కూడా అమలు చేయడానికి పేర్ల మార్పు సరి కాదని విమర్శించింది.

జగనన్న అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అన్నారు.. అది ఏమైందని వైఎస్ఆర్పీపీ నిలదీసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది ఎగొట్టారని విమర్శించింది. ఇక వచ్చే ఏడాది కూడా ఇస్తారో లేదో తెలియదని, ఇస్తే ఎంతమందికి ఇస్తారో కూడా క్లారిటీ ఇవ్వరని తెలిపింది.

జగనన్న విద్యా కానుకను పేరు మార్చి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర అంటున్నారని, స్కూళ్లలో ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు సరిగ్గా అందలేదని వైఎస్ఆర్సీపీ మండిపడింది. విద్యా కానుకలో మిగిలిన వస్తువుల సంగతి సరేసరి అంటూ ఎద్దేవా చేసింది.

జగనన్న గోరుముద్ద పేరుని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అంటున్నారని, జీతాలు అందట్లేదని, సరుకులు లేవని, ఆయాలు ఒకటే గొడవ చేస్తోన్నారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. అయిదు రోజుల కోడిగుడ్డుకు మంగళం దిశగా అడుగులు వేస్తున్నారంటూ ధ్వజమెత్తింది. భోజనాలు బాగాలేవంటూ స్కూలు పిల్లలు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

మనబడి నాడు- నేడు పథకాన్ని కాస్తా.. మన బడి- మన భవిష్యత్తుగా పేరు పెట్టారని, ఆ పథకం కింద చేపట్టిన పనులపై విచారణల పేరిట కాలయాపన చేస్తోన్నారంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఎక్కడిక్కడ నాడు- నేడు పనులు నిలిచిపోయాయని, వాటిని కొనసాగించే ఉద్దేశం కూడా ఎక్కడా కనిపించట్లేదని పేర్కొంది.

స్వేచ్ఛ బాలికా రక్ష‌ను తెచ్చిందే జగన్ ప్రభుత్వం అని..దీనికి స్టిక్కర్‌ మార్చారని విమర్శించింది. కనీసం దీన్నయినా సక్రమంగా అమలు చేస్తారా? లేదా ? అనేది సందేహమేనని తెలిపింది. జగన్ ఆణిముత్యాలను అబ్దుల్‌ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారని, అది ఎప్పుడు? ఎంతమందికి ఇస్తారో తెలియట్లేదని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+