జడ్డీలపై కామెంట్ల కేసు- రేపు సీబీఐ ముందుకు ఆమంచి- విశాఖలో విచారణ
ఏపీలో గతంలో హైకోర్టుకూ, ప్రభుత్వానికీ మధ్య కోల్డ్ వార్ సాగుతున్న నేపథ్యంలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా పలువురు వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు సీఐడీ విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఐడీ ఇచ్చిన నివేదికతో సంతృప్తి చెందని హైకోర్టు ఈ కేసును సీబీకి అప్పగించింది.
హైకోర్టు జడ్లీలకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు ఈ నెల 6న హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది. అయితే ఆ రోజు వ్యక్తిగత పనుల కారణంగా మినహాయింపు ఇవ్వాలని ఆమంచి కోరారు. దీంతో ఆయన్ను రేపు విశాఖలోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు పంపింది. రేపు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యేందుకు ఆమంచి సిద్ధమవుతున్నారు.

హైకోర్టు జడ్డీలపై అనుచిత వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో దాదాపు వంద మందిపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇందులో తీవ్రమైన వాటిపై ప్రస్తుతం సీబీఐ ముందుగా విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగానే బాధ్యతాయుత పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులకు నోటీసులు పంపుతోంది. ఇదే క్రమంలో ఆమంచికి కూడా నోటీసులు పంపింది. ఆమంచి వివరణతో సంతృప్తి చెందకపోతే తదుపరి చర్యలకు సీబీఐ సిద్ధం కావొచ్చని తెలుస్తోంది. మరోవైపు జడ్డీలపై వ్యాఖ్యల కేసులో సీబీఐ విచారణకు హాజరవుతున్న తొలి వైసీపీ నేత కూడా ఆమంచే కావడం విశేషం.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications