• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పవన్ కళ్యాణ్..మన్మధుడిని ఫాలో అయ్యారు: పవిత్ర బంధంలో అక్రమ బంధం : రిటైర్డ్ ఐపీయస్ ఇక్బాల్..!

|

ముఖ్యమంత్రి జగన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివాహాల గురించి కామెంట్లు చేయటం..రాజకీయంగా రచ్చ మరవక ముందే వైసీపీ నేత మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రిటైర్డు ఐపీఎస్ అధికారి అయిన వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ నేరుగా పవన్ పైన విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ పవిత్రబంధంలో ఉంటూనే వేరొక వ్యక్తితో బంధం అక్రమంగా కొనసాగించడం అప్పట్లో నేరమన్నారు.

పవన్ కల్యాణ్ చెగువేరా ను అభిమానిస్తున్నారుగాన..నిజ జీవితంలో మన్మధుడ్ని ఫాలో అయ్యారంటూ వ్యాఖ్యానించారు. ప్రశ్నించేతత్వాన్ని మరిచిపోయారని...నైతికతను వివాహ బంధంలో విడనాడారని ఫైర్ అయ్యారు. అదే విధంగా.. రాజకీయాలలో సైతం నైతికతను మరిచిపోయారని మండిపడ్డారు. ఇప్పుడు ఇక్బాల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ కు కారణమయ్యారు.

పవన్ మన్మధుడిని ఫాలో అయ్యారు..

పవన్ మన్మధుడిని ఫాలో అయ్యారు..

జనసేన అధినేత పవన్ చెగువేరాను అభమానించినా..నిజ జీవితంలో మన్మధుడిని ఫాలో అయ్యారని వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ తీవ్ర విమర్శ చేసారు. పవన్ కల్యాణ్ పవిత్రబంధంలో ఉంటూనే వేరొక వ్యక్తితో బంధం అక్రమంగా కొనసాగించడం అప్పట్లో నేరమన్నారు. రాజకీయాల్లో సైతం నైతికతను మర్చిపోయారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకొని..

చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకొని..

రైతుల ఇబ్బందులను ప్రశ్నిస్తానని చెప్పి కనీసం ఆ పని చేయలేదుని ఇక్బాల్ విమర్శించారు. రైతు వేషంలో వచ్చి చంద్రబాబుతో వచ్చి కలిసి ప్యాకేజి మాట్లాడుకున్నారని ప్రజలు చెప్పుకున్నారని వివరించారు. చంద్రబాబు చేసిన 2.50 లక్షల కోట్ల అప్పు..40వేల కోట్ల బిల్లులపై మీరు ప్రశ్నించారా అని నిలదీసారు. దేశంలో వృధ్ది రేటు గురించి ప్రస్తావిస్తూ రాష్ర్ట వృధ్ది రేటును చంద్రబాబు చెబుతున్నా పవన్ ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.

రేణు దేశాయ్ స్వయంగా చెప్పారు..

రేణు దేశాయ్ స్వయంగా చెప్పారు..

పవన్ కల్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేది కాదని..తనతో బంధంలో ఉన్నపుడే వేరే అమ్మాయితో సంబంధం కొనసాగించారని రేణుదేశాయే స్వయంగా చెప్పారని గుర్తించారు. మీ తల్లి మిమ్మల్ని సంస్కారయుతంగా పెంచారని చెప్పారు...మరి అది మీ చేతల్లో కనిపించడం లేదని...అది వివాహ బంధం కావచ్చు,రాజకీయాలలో కావచ్చు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

ఇసుక కొరత వస్తే

ఇసుక కొరత వస్తే

టిడిపినుంచి బయటకువచ్చి లోకేష్ అవినీతిపై మాట్లాడి తర్వాత పవన్ మరచిపోయారని ఎద్దేవా చేసారు. ఇసుక వరదల వల్ల కొరత వస్తే దానిపై ప్రభుత్వం చెబుతున్నప్పటికి లాంగ్ మార్చ్ చేశారని విమర్శించారు. తిరుపతి సభలో మీకు వాచ్ డాగ్ లా ఉంటానని చెప్పారని..ఆ తర్వాత చంద్రబాబు అక్రమకట్టడంలో ఉన్నా..ఓటుకునోటు కేసులో పట్టుబడ్డా..శివరామకృష్ణన్ కమిటిని పక్కన పెట్టి నారాయణ కమిటి నిర్ణయాలు అమలు చేసినా ప్రశ్నించలేదని దుయ్యబట్టారు.

 పాదయాత్రలో జగన్

పాదయాత్రలో జగన్

ఇంగ్లీషు మీడియా అనేది తక్షణం తీసుకోలేదని...నిపుణుల కమిటి తన పాదయాత్రలో ప్రజలు చెప్పిన మీదటనే సీఎం జగన్ ఆ నిర్ణయం అమలు చేస్తున్నారని వివరించారు. తిరుమలకు ఓ సామాన్య భక్తుడిగా జగన్ వెళ్ళారని...ఆయనకు మీ సర్టిఫికేట్ అవసరం లేదని పవన్ కు స్పష్టం చేసారు. పీఠాధిపతులే సర్టిఫికేట్ ఇచ్చారు...మీరు చెబుతున్న సర్టిఫికేట్ అవసరం లేదున్నారు.

లక్ష కోట్లు అన్నారు.. 43 వేల కోట్లు

లక్ష కోట్లు అన్నారు.. 43 వేల కోట్లు

జగన్ పైన ఉన్నవి బనాయింపబడిన కేసులని...లక్ష కోట్లు అన్నారు...తర్వాత 43 వేల కోట్లు అన్నారు...నిజానికి 1300 కోట్లు పైబడి మాత్రమే సంబంధించిన వ్యవహారం అని దర్యాప్తు అదికారి చెప్పారని వివరించారు. జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఇక్బాల్ ధీమా వ్యక్తం చేసారు. అధికారులపై కేసులు ఎలా తేలిపోయాయో అదే రీతిలో జగన్ గారి కేసులు విషయంలో కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు.

  Pawan Kalyan Sensational Comments On YS Jagan During Opening Of Dokka Seethamma Aahara Sibiralu

  English summary
  Retired IPS officer and YCP MLC sensational comments Pawan Kalyan. He says pawan follwed manmadha in real life. He mentioned Renu Desai comments on pawan.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X