ఐప్యాక్ పనికిమాలిన సంస్థ.. వైసీపీ నేత సంచలన కామెంట్స్

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘెరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ.. తీవ్ర ప్రజాగ్రహానికి లోనై కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలకు గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఇక ఓటమిపై పార్టీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పార్టీ ఓటమిపై మాట్లాడారు. ఎన్నికలలో పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వాలంటీర్ వ్యవస్థ, ఐప్యాక్ సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఐప్యాక్ పనికిమాలిన సంస్థ.అందులో రాజకీయాలకు పనికిరాని డిగ్రీలు చదివిన వారు తమ పబ్బం గడుపుకున్నారు.వాళ్లను నమ్మి జగన్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులను దూరం పెట్టారని కొట్టు వ్యాఖ్యానించారు.

ysrcp leader kottu satyanarayana shocking comments on ipac

ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి నివేదికలు పంపారు అంటూ కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజలకు మంచి చేయడంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే వైఎస్ జగన్ రెండు అడుగులు ఎక్కువ వేసినప్పటికీ కార్యకర్తలను దూరం చేసుకోవడం ఆయన చేసిన తప్పని అన్నారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులను పక్కనపెట్టి మరీ జగన్ ఐ ప్యాక్ టీం ని నమ్ముకున్నారని.. అందువల్లే వైసీపీ ఈ స్థాయిలో ఘోర ఓటమి పాలయ్యిందని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+