నీ ఆస్పత్రిలో భజన చేసుకో- మాధవీలతపై పేర్నినాని సెటైర్లు..!
తిరుమల లడ్డూ వివాదం తెరపైకి వచ్చాక వైసీపీపై ఏపీ బీజేపీ నేతల కంటే తెలంగాణకు చెందిన కాషాయ నేతల దాడి ఎక్కువైంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నేతలపై విరుచుకుపడుతూ తెలంగాణ బీజేపీ నేత మాధవీ లత చేస్తున్న మాటల దాడిపై ఆ పార్టీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుమలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో భజనం చేసుకుంటూ వచ్చిన మాధవీలతపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు.
మాధవీలత తీరుపై ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే పరోక్షంగా స్పందించారు. తెలంగాణ బీజేపీ నేతల్ని తీసుకొచ్చి మరీ తమపై విమర్శలు, నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ మాజీ పేర్నినాని కూడా మాధవీలత తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ నుంచి బీజేపీ నేత ఒకావిడ భజన చేసుకుంటూ వచ్చేసిందని, ఇదంతా దిక్కుమాలినతనం అంటూ పేర్నినాని సంచలన విమర్శలు చేశారు.

చేతనైనే నీ ఆస్పత్రిలో భజన చేయమంటూ పేర్ని నాని మాధవీలతపై ఫైర్ అయ్యారు. కరోనా సమయంలో నీ ఆస్పత్రిలో హిందువులకు పైసా తగ్గించావా అని అడిగారు. నీ ఆస్పత్రి భాగోతాలు తెలియదా అని నిలదీశాు. ఎక్కడో ఓవైసీ ఆస్పత్రిలో తగ్గించలేదని అడుగుతోందని, ఆమె తన ఆస్పత్రిలో హిందువులకు బిల్లు తగ్గించారా అని పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో ఏపీ గవర్నర్ ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బీజేపీ నేతలు ప్రశ్నించారా అని పేర్ని కడిగిపారేశారు. ఈ రాష్ట్రం కాని వాళ్లు హిందువుల గురించి, గుడి గురించి, మతం గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications