కాపుల కోసం కొట్లాడవా ? రంగా వారసుడివేనా ? వంగవీటి రాధాపై పోతిన మహేష్ ..!
ఏపీలో కాపుల ఆరాధ్య దైవం వంగవీటి రంగా 36వ వర్ధంతి సందర్భంగా పలు చోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఇలాంటి వేళ విజయవాడ వైసీపీ నేత పోతిన మహేష్ ఆయన కుమారుడు వంగవీటి రాధాపై నిప్పులు చెరిగారు. విజయవాడ చెరువు సెంటర్ లో జరిగిన వంగవీటి రంగా 36వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మహేష్.. రాధా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాపుల కోసం పోరాడకుండా వంగవీటి రాధా మౌనంగా ఉండిపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి రంగా అని, వంగవీటి రంగా తమకు ఎప్పటికీ స్పూర్తి అని పోతిన మహేష్ తెలిపారు. ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలిపిన వ్యక్తి రంగా అన్నారు.వంగవీటి రంగా అందరి వాడని, కాని సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.రంగా ఉద్యమ వారసులుగా తాము అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు.

వంగవీటి రంగా ఆశయాలను తీసుకెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారంటూ వంగవీటి రాధాపై పోతిన మహేష్ విమర్శలు గుప్పించారు. కాపు రిజర్వేషన్ల పైన రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడలేదన్నారు. విగ్రహావిష్కరణ లు చేస్తూ తానే వారసుడని రాధా చెప్పుకుంటున్నారన్నారు. కాని రంగా ఆశయాల కోసం ఎక్కడా నిలబడని వ్యక్తి రాధా అన్నారు. రంగా కొడుకు రాధా ఆలోచన అర్ధం కావడం లేదన్నారు. కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా వంగవీటి రాధా ఎప్పుడు బయటకు రాలేదన్నారు. అయినా రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయన్నారు.
ప్రజా సమస్యలపై, కాపు సామాజిక వర్గ సమస్యలపై రాధా మాట్లాడకపోవడం తనకు బాధేస్తుందని పోతిన మహేష్ తెలిపారు.ఎన్నికల్లో మాత్రమే రాధా బయటకు వస్తున్నారని, మిగతా అంశాల్లో బయటకు రాకపోవడం రంగా వారసులమైన తమ లాంటి వాళ్లకు బాధేస్తుందన్నారు. రంగా పేరు జిల్లాకు పెట్టాలని రాధా ఎక్కడా మాట్లాడడం లేదు ఎందుకని ప్రశ్నించారు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారుల కు రాధా మేలు చేసినవి అనేకం ఉన్నాయన్నారు. రాధా పదవి గురించి మాట్లాడడం కాదని, రంగా ఆశయాల సాధన కోసం నడుం బిగించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడైనా మాట్లాడకుంటే ఎలా అన్నారు. బీసీ వర్గాల భవిష్యత్తును కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపడం దురదృష్టకరమన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications