రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!!
తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ హోరా హోరీ అధికార - ప్రతిపక్షాల మధ్య రాజకీయం నడుస్తోంది. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డిని వైసీపీ మాజీ మంత్రి రోజా కలవటం.. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని.. పలకరింపులు ఈ రోజున రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ ఇద్దరి పలకరింపు వీడియో.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రియాంక గాంధీతో పాటుగా పార్టీ అధినేత ఖర్గేను కలిసేందుకు రేవంత్ పార్లమెంట్ కు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ మాజీ మంత్రి రోజా పార్లమెంట్ లాబీల్లో రేవంత్ కు ఎదురుపడ్డారు. రోజాకు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను పని మీద పార్ల మెంట్ కు వచ్చినట్లు రోజా తెలిపారు. ఆ తరువాత ఇద్దరూ అనంతరం అక్కడి నుంచి వెళ్లిపో యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోజా, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు రోజా ఏపీలోని తన నివాసంలో ఆతిధ్యం ఇచ్చారు. ఈ విషయం పైన పలు సందర్భాల్లో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ.. రేవంత్ పలు మార్లు సెటైర్లు వేసారు. అయితే, ఇద్దరూ ఎదురుపడటంతో పలకరించుకోవటం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం నిమిషాల్లో జరిగిపోయింది.

నితిన్ గడ్కరీతో రోజా భేటీ
కాగా, రోజా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం అయ్యారు.జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 200 సంవత్సరాల ప్రాచీన ఆలయం విషయాన్ని ప్రాధాన్యంగా ప్రస్తావిస్తూ, అది నగరి చరిత్ర, సంప్రదాయం, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందని వివరించారు, దాని చారిత్రక ప్రాముఖ్యతను కాపాడే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. అదేవిధంగా కొండ చుట్టూ మండపం ఏర్పాటు, నగరిలో పెరుగుతున్న రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణం అవసరం, పుత్తూరు ప్రాంతం లో జాతీయ రహదారి పనులు నెమ్మదిగా సాగడం, సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల జరుగు తున్న ప్రమాదాలు వంటి అంశాలను సమగ్రంగా వివరించారు. ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ సమస్యలను అత్యవసరంగా పరిగణించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మిధున్ రెడ్డితో పాటుగా గడ్కరీని కలిసిన రోజా వినతుల పైన సానుకూ స్పందన వ్యక్తం అయింది.












Click it and Unblock the Notifications