చంద్రబాబు, పవన్ విడిగా వెళ్లడం వెనుక వ్యూహం? అర్థమైందన్న రోజా..!
తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం వచ్చి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. అయితే ఘటన జరిగిన తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత జగన్ తో పాటు పలువురు రాజకీయ నేతలు, మంత్రులు ఘటనా స్దలికి వెళ్లి పరిశీలించడంతో పాటు ఆస్పత్రులకు వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్ కళ్యాణ్ వేర్వేరుగా తిరుపతిలో పర్యటించడం చర్చనీయాంశమైంది.
నిన్న తిరుపతిలో వేర్వేరుగా పర్యటించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ అధికారులతో పాటు పోలీసులు, అధికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరూ వ్యూహాత్మకంగా వేర్వేరుగా పర్యటించడంతో పాటు మాటల్లోనూ వ్యూహాత్మకంగా వేర్వేరు అధికారుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీంతో చంద్రబాబు, పవన్ పర్యటన, వారి మాటల వెనుక ఉన్న వ్యూహంపై చర్చ జరుగుతోంది.

ఇదే అంశంపై వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ ట్వీట్ పెట్టారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..? వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు, కానీ టీడీపీ,జనసేన, బీజేపీ ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం కారణంగా ఆరుగురు తమ ప్రాణాలను కోల్పోయారని రోజా ఆరోపించారు. ఈ ఘటనకు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణమని రోజా తెలిపారు. ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రజల్లో అగ్రహాం రావడంతో సమాజ మెప్పు కోసం అంగీకరించారన్నారు.
పవన్ కళ్యాణ్ మాటలలోనే విధినిర్వహణలో టిటిడి చైర్మన్, ఈఓ శ్యామల రావు, అదనపు ఈఓ వెంకయ్యచౌదరి లు పూర్తిగా విఫలం అయ్యారు అని స్పష్టమయిందన్నారు. మరి కీలక స్థానంలో ఉన్న ప్రధాన అధికారులు, పాలక మండలి వైఫల్యమే కదా తొక్కిసలాటకి కారణం. ఫలితంగా ఆరుగురు భక్తులు తమ నిండు ప్రాణాలు కోల్పోయారన్నారు. అందుకు కారణమైన టిటిడి చైర్మన్, ఈఓ, అదనపు ఈఓ లపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగరని రోజా ప్రశ్నించారు.
ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?
— Roja Selvamani (@RojaSelvamaniRK) January 10, 2025
వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!!
కానీ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వం మరియు @TTDevasthanams నిర్లక్ష్యం కారణంగా 6 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
ఈ ఘటన కు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య…
అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం, చంద్రబాబుకు కు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకియ ప్రయోజనాలు కాపాడుకోవడం పవన్ లక్ష్యం అని రోజా ఆరోపించారు. ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వేర్వేరుగా వచ్చారంటేనే అర్దం అవుతుంది మీ వ్యూహం ఏమిటో అంటూ పవన్ పై రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications