సింగయ్యను కుక్కతో పోలుస్తారా ? దళితులంటే చిన్నచూపా ? చంద్రబాబుపై వైసీపీ ఫైర్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల టూర్ సందర్భంగా ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. సింగయ్యను జగన్ కారు బలిగొందని ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. నిన్న ఆయన భార్యతో అబద్ధాలు చెప్పించారంటూ కుప్పం టూర్ లో ఆరోపించారు. అక్కడితో ఆగకుండా కుక్క పిల్లను వదిలేసినట్లు కారు కింద పడ్డ సింగయ్యను వదిలేసి వెళ్లిపోయారన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ మండిపడింది.
ప్రమాదవశాత్తు మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైసీపీ సీనియర్ నేత సాకె శైలజానాథ్ మండిపడ్డారు. సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య చెప్పడం ద్వారా చంద్రబాబు కుట్రల్ని బద్దలు చేశారన్నారు. నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఇంకైమైనా ఉంటుందా అని శైలజానాథ్ ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అన్నారు.

45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదని, దళితులు, అణగారిన వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారని శైలజానాథ్ విమర్శించారు. సత్తెనపల్లి లో జరిగిన సింగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడటం ద్వారా తన నైజాన్ని మరోసారి చాటుకున్నారననారు. కారు కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్లలా లాగిపడేశారని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడన్నన్ననారు. చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబు తనకు ఉన్న చులకలభావాన్ని చాటుకున్నారన్నారు. సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని, వైయస్ జగన్‌పై పన్నిన కుతంత్రంను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేశారన్నారు.
దళితుల పట్ల చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందనేది తమకు తెలుసని, మొన్న తెనాలిలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విషప్రచారం చేశారని శైలజానాథ్ గుర్తుచేశారు. గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే, ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయన్నారు. నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారని, జేమ్స్ అనే యువకుడితే మూత్రం తాగించారని ఆరోపించారు. దళితుల మీద సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయన్నారు.

సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసినా కనీసం దానిపై ఒక్క స్టేట్‌మెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గంలో దళితులు నడిచారని రోడ్డు మైలపడిందని పసుపు నీళ్లతో కడిగిన దారుణం ఇప్పటికీ మా కళ్లలో కదులుతూనే ఉందన్నారు. ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్లినంత మాత్రాన దళితులను ఉద్దరించినట్టు ప్రజలకు అనుకుంటారనే భ్రమల్లో నుంచి బయటకు రావాలని చంద్రబాబును శైలజానాథ్ కోరారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications