పవన్ ది సభ కాదు - ప్రీ రిలీజ్ ప్రమోషన్ : చంద్రబాబు స్క్రిప్టునే - వైసీపీ నేతల ఫైర్..!!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ నర్సాపురం సభలో చేసిన వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు స్పందించారు. జీవో 217కు, సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎటువంటి సంబంధం లేదన్న విషయం కూడా తెలియని అజ్ఞాని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అని మంత్రి అప్పలరాజు... ఎంపీ మోపిదేవి వ్యాఖ్యానించారు. నరసాపురంలో జరిగింది మత్స్యకార సభ కాదని, సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. మత్స్యకారుల సమస్యలపై అవగాహనలేని పవన్‌సినిమా స్క్రిప్టులు, చంద్రబాబు స్క్రిప్టు చదువుతూ మభ్యపెడుతున్నారని చెప్పారు.
Recommended Video
జీవో 217 వల్ల మత్స్యకారులకు మరింత లాభం కలుగుతుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల బతుకులు మార్చేందుకు చేపల అవుట్ లెట్‌లతో విక్రయాలు చేయడానికి ప్రయత్నిస్తుంటే వాటిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మత్స్యకారులకు మేలు చేస్తున్న సీఎం జగన్‌పై విమర్శలు చేయడం తగదన్నారు. యువకులకు ఉపాధి కల్పిస్తుంటే ప్రభుత్వం చేపలు అమ్ముతోందని ఎద్దేవా చేయడం సబబు కాదన్నారు. ఇలా మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించే వారెవరైనా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

పవన్ అవగాహన లేకుండా 215, 217 జీవోలపై జెట్టి, గంగమ్మ పూజలు, ఫిషింగ్ హార్బర్ అంటూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మత్స్యకారులు మరణిస్తే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు. ఈ జీవోను పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్నామని, 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లామని తెలిపారు. వాస్తవంగా తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయని, వేల ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో ఉండటం లేదని చెప్పారు.
దీంతో వాటిపై వచ్చే ఆదాయం దళారీ వ్యవస్థకే చెందుతోందన్నారు. ఈ వ్యవస్థను రూపుమాపి ఆ ఫలసాయాన్ని సొసైటీల ద్వారా మత్స్యకారులకు అందించేందుకు ఈ జీవో ఎంతో ఉపకరిస్తుందని వివరించారు. దళారీ వ్యవస్థను రూపుమాపి మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు, మత్స్యకార సొసైటీలో ప్రతి సభ్యుడికి రూ.15 వేల వరకు ఆదాయం వచ్చేలా చూసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 217 జీవో తీసుకొచ్చారని చెప్పారు.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications