G7 సదస్సులో ఆసక్తికర ఘటన.. మోడీ - ట్రంప్ భేటీకి టైమ్ ఫిక్స్ !!
ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలుసుకోవడం దౌత్య వర్గాల్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఇరు నేతలు చిరునవ్వుతో పరస్పరం కరచాలనం చేసుకుని కొద్దిసేపు మాట్లాడారు. దాదాపు 16 నెలల తర్వాత మోదీ, ట్రంప్ ఒకే అంతర్జాతీయ వేదికపై ముఖాముఖి కనిపించడం ఇదే తొలిసారి.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ గత ఏడాది వాషింగ్టన్ వెళ్లారు. ఆ పర్యటన తర్వాత ఇరు నేతల మధ్య ప్రత్యక్ష భేటీ జరగలేదు. ఇటీవలి కాలంలో ఆపరేషన్ సిందూర్, భారతీయ వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్‌ల కారణంగా భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు పెరిగిన నేపథ్యంలో ఈ కలయికకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది.

జీ7 వేదికపై భారత్‌కు ఎందుకు ప్రాధాన్యం?
జీ7లో భారత్ శాశ్వత సభ్యదేశం కాకపోయినా, వరుసగా ఏడోసారి ఈ సదస్సుకు ఆహ్వానం అందుకోవడం న్యూఢిల్లీ దౌత్య బలం పెరుగుతున్న సంకేతంగా భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, సాంకేతిక మార్పులు, భౌగోళిక ఉద్రిక్తతలపై జరుగుతున్న చర్చల్లో భారత్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వినిపించే అవకాశం ఈ వేదిక ఇస్తోంది.
ఈసారి సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ ఎకనామిక్ స్టెబిలిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ పరిస్థితులు ప్రధాన అజెండాగా ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెరుగుతున్న ఆర్థిక, ఇంధన భారాన్ని భారత్ ప్రస్తావించే అవకాశం ఉంది. గ్లోబల్ సౌత్ తరఫున న్యూఢిల్లీ తీసుకునే వైఖరిపై కూడా సభ్యదేశాల దృష్టి ఉంది.
మోదీ షెడ్యూల్‌లో ద్వైపాక్షిక చర్చలు
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. సదస్సు అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇచ్చే గాలా డిన్నర్‌లో కూడా ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశాలు వాణిజ్యం, భద్రత, సాంకేతిక సహకారం వంటి అంశాలపై భారత్‌కు దౌత్య అవకాశాలను తెరవనున్నాయి. కాగా బుధవారం (జూన్ 17)న మోదీ, ట్రంప్ భేటీ కానున్నారు.
The interactions with world leaders continue at the G7 Summit in Evian.@G7 pic.twitter.com/ZOrAaffrcX
— Narendra Modi (@narendramodi) June 16, 2026
మోదీ-ట్రంప్ కరచాలనం తక్షణ విధాన మార్పుకు సంకేతమని చెప్పలేకపోయినా, ఉద్రిక్తతల మధ్య సంభాషణకు తలుపులు తెరిచి ఉన్నాయనే రాజకీయ సందేశాన్ని ఇచ్చింది. జీ7 చర్చల తరువాత భారత్-అమెరికా మధ్య వాణిజ్యం, భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యంపై వచ్చే అధికారిక సంకేతాలు కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications