ఓటుకు నోటు కేసు విచారణ మళ్ళీ మొదటినుండి.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

తెలుగు రాష్ట్రాలలో గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్ళీ కొత్తగా తెరమీదకు రానుంది. సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయంతో ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణను పూర్తిగా రద్దుచేసి మళ్ళీ మొదటి నుండి విచారణ చెయ్యాలని, ఈ కేసులో మళ్ళీ మొదటనుండి వాదనలు వింటామని కోర్టు చెప్పటంతో అందరి ఫోకస్ ఒక్కసారిగా ఓటుకు నోటు కేసుపైకి మళ్ళింది.

బహుభార్యత్వంపై మీ స్పందన ఏంటీ- కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
బహుభార్యత్వంపై మీ స్పందన ఏంటీ- కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య పిటీషన్ల విచారణతో సుప్రీం నిర్ణయం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు విచారణ పూర్తిగా రద్దు చేసి కొత్తగా వాదనలను వింటామని స్పష్టం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత సండ్ర వెంకట వీరయ్య సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కోర్టు నిర్ణయం తీసుకుంది.

Vote-for-Note case Supreme Court orders fresh hearing in Vote-for-Note case from scratch after cancelling previous proceedings

రేవంత్ పిటీషన్ అందుకే, వెంకట వీరయ్య పిటీషన్ కారణమిదే

2015లో నమోదైన ఈ కేసును ఎన్నికల నియమావళి కింద చూడకుండా, నిబంధనలకు విరుద్ధంగా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు కాబట్టి తనపై ఉన్న ఈ కేసు చెల్లదని 2021లో రేవంత్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కేసు నుంచి తన పేరును పూర్తిగా తొలగించాలని సండ్ర వెంకటవీరయ్య కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ రెండు పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారిస్తుంది.

పిటీషన్లపై విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా

ఇక ఈ పిటిషన్ లకు సంబంధించి ఇరు పక్షాల న్యాయవాదులు సీనియర్ అడ్వకేట్ లు అయిన సిద్ధార్థ్ లూద్రా, దామా శేషాద్రి నాయుడు హాజరై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సిన ఉన్నందున సమయం కోరడంతో, బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. దీంతో 11 ఏళ్ల క్రితం నాటి ఈ కీలక కేసు విచారణ మళ్లీ మొదటి నుండి ప్రారంభం కానుంది.

విజయ్ సర్కార్ కు సుప్రీం బిగ్ రిలీఫ్..! మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పై స్టే ..!
విజయ్ సర్కార్ కు సుప్రీం బిగ్ రిలీఫ్..! మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పై స్టే ..!

కేసు విచారణ మళ్ళీ కొత్తగా.. రాజకీయవర్గాలలో చర్చ

అంతేకాదు గతంలో ఈ పిటిషన్లను విచారించిన ధర్మాసనం లోని ఒక న్యాయమూర్తి పదవి విరమణ పొందిన తర్వాత, పాత వాదనలను పక్కనపెట్టి సరికొత్తగా మళ్లీ విచారణ ప్రారంభిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారి తీసింది. అసాధారణంగా సుప్రీంకోర్టు ఈ విధంగా గత విచారణను రద్దు చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+