ఢిల్లీ చేరిన ఏపీ పోస్టల్ బ్యాలెట్ల వివాదం
Perni Nani: ఓట్ల లెక్కింపు గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఏపీలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంటోంది. అందరి దృష్టీ కౌంటింగ్ డే మీదే నిలిచింది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూటమి ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తోన్నాయి.
ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలూ వెలువడేది అప్పుడే. ఎవరు రాజవుతాడు? ఎవరు బంటు.. అనేది తేలుతుందారోజున.

ఈ పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారం క్రమంగా ముదురుతోంది. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం మధ్య మాటలదాడికి దారి తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అయిదున్నర లక్షలకు పైగా పోలైన పోస్టల్ బ్యాలెట్లు.. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆయా అభ్యర్థుల గెలుపోటములను తీవ్రంగా ప్రభావితం చేయగలుగుతాయనే అంచనాలు ఉన్నాయి.
అదే సమయంలో ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్లపై ఇచ్చిన ఓ మెమో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాట్లు ఏపీలోనే ఎందుకు ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని చెబుతున్నారు.
దీన్ని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మీనా ఇచ్చిన మెమో ఎన్నికల కమిషన్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని అన్నారు. అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని, ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్లను తిరస్కరించే అవకాశం కల్పిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications