వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థులు ఎంపిక‌..! వైవీ సుబ్బారెడ్డికి దక్కని ఒంగోలు సీటు..!!

అమరావతి/ హైద‌రాబాద్: ఏపి రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో అభ్య‌ర్థుల ఎంపిక‌లో అన్ని పార్టీలు మునిగిపోయాయి. అదికార తెలుగుదేశం పార్టీతో ధీటుగా ప్ర‌తిప‌క్ష పార్టీ వైసిపి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింది. మెజారిటి లోక్ స‌భ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసిన వైసీపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రికొంత మంది అభ్య‌ర్థుల‌పై క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఏపిలో 2019 ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మంగా తీసుకున్న పార్టీలు అంతే స్థాయిలో గెలుపుకోసం పావులు క‌దుపుతున్నాయి.

వైసీపి ఎంపీ అభ్య‌ర్థుల ఖరారు..! వైవీ సుబ్బారెడ్డి సీటుపై నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

వైసీపి ఎంపీ అభ్య‌ర్థుల ఖరారు..! వైవీ సుబ్బారెడ్డి సీటుపై నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఒంగోలులో తన బాబాయి వైవీ సుబ్బారెడ్డికి అధ్యక్షుడు వైఎస్ జగన్ మొండిచేయి చూపించారు. ఆ లోక్‌సభ స్థానంలో పార్టీ టికెట్‌ను ఆయనకు నిరాకరించారు. అక్కడి నుంచి నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయించారు. పార్టీలో అధికారికంగా చేరని మాగుంట శ్రీనివాసులురెడ్డిని నెల్లూరు నుంచి పోటీ చేయించనున్నారు. శనివారమే పార్టీలో చేరిన మోదుగుల వేణుగోపాలరెడ్డికి గుంటూరు, దాసరి జైరమేశ్‌కు విజయవాడ లోక్‌సభ స్థానాలు ఖరారు చేశారు.

పాత‌వారికే అవ‌కాశం ఇచ్చిన జ‌గ‌న్..! మ‌రికొన్ని స్థానాల్లో వ‌డ‌పోత‌..!!

పాత‌వారికే అవ‌కాశం ఇచ్చిన జ‌గ‌న్..! మ‌రికొన్ని స్థానాల్లో వ‌డ‌పోత‌..!!

1. దువ్వాడ శ్రీనివాస్. (శ్రీకాకుళం), 2. బొత్స ఝాన్సీ (విజయనగరం), 3.ఎంవీవీ చౌదరి(విశాఖ), 4.వరుదు కల్యాణి(అనకాపల్లి), 5.గంజి అశోక్(కాకినాడ), 6.మార్గాని భరత్ (రాజమహేంద్రవరం), 7.చింతా అనూరాధ (అమలాపురం), 8.రఘురామకృష్ణంరాజు(నరసాపురం), 9.కోటగిరి శ్రీధర్ (ఏలూరు), 10.బాలశౌరి(మచిలీపట్నం), 11.లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట), 12.పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి(రాజంపేట), 13.వైఎస్ అవినాశ్‌రెడ్డి(కడప), 14.గోరంట్ల మాధవ్(హిందూపురం), 15.పి.డి.రంగయ్య(అనంతపురం), 16.బ్రహ్మానందరెడ్డి(నంద్యాల) అభ్యర్థిత్వాలు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంకా సుమారు తొమ్మిది స్థానాల‌ను ఖ‌రారు చేయాల్సి ఉంది.

లోట‌స్ పాండ్ లో లోతైన చ‌ర్చ‌..! గెలిచే అభ్య‌ర్థుల‌కోసం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు..!!

లోట‌స్ పాండ్ లో లోతైన చ‌ర్చ‌..! గెలిచే అభ్య‌ర్థుల‌కోసం జ‌గ‌న్ క‌స‌ర‌త్తు..!!

అధికారికంగా వీరి పేర్లు ప్రకటించకున్నా అభ్యర్థులు మాత్రం ప్రస్తుతానికి వీరేనని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. ఎన్నికల నాటికి వీరికంటే బలమైన వ్యక్తులు పార్టీలోకి వస్తే వీరిని తప్పించి, కొత్తవారికి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఆయా నియోజకవర్గాల్లో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలకు కూడా పార్టీ అధినేత స‌ముచిత స్థానం క‌ల్పించాల‌నే డిమాండ్ వైసీపిలో వినిపిస్తోంది.

మ‌రో రెండు మూడు రోజుల్లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌..! సీనియ‌ర్ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న జ‌గ‌న్..!!

మ‌రో రెండు మూడు రోజుల్లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌..! సీనియ‌ర్ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్న జ‌గ‌న్..!!

ఇదిలా ఉండ‌గా, ఒంగోలు ఎంపీగా, తనకు రాజకీయ సలహాదారుగా చేదోడువాదోడుగా ఉంటూ వచ్చిన బాబాయి వైవీ సుబ్బారెడ్డిని జగన్ ఈ దఫా ఎన్నికలకు దూరంగా ఉంచడంపై పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఒంగోలు సీటు తనకివ్వకపోవడంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని, అందుకే తాడేపల్లిలో జగన్ గృహప్రవేశానికి సుబ్బారెడ్డి హాజరు కాలేదని వైస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. మ‌రి తుది ఎంపిక‌లో వైవికి స్థానం ఖ‌రారు చేస్తారా లేదా అనే చ‌ర్చ లోట‌స్ పాండ్ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+