వైసీపీకి అతిపెద్ద ఎదురుదెబ్బ..! ఊహించిన దాని కంటే దారుణంగా..!
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయితే వీటన్నింటికీ మించిన ఎదురుదెబ్బ ఇవాళ ఆ పార్టీకి తగిలింది. గత ప్రభుత్వంలో మూడు రాజధానుల ఏర్పాటులో భాగంగా కార్యనిర్వాహక రాజధానిగా నిర్ణయించిన విశాఖపట్నంలో ఆ పార్టీ మేయర్ పదవిని కోల్పోయింది. ఈ మేరకు ఎన్డీయే కూటమి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఇవాళ ఏకపక్షంగా నెగ్గింది. దీంతో వైసీపీకి మరో గట్టి షాక్ తగిలినట్లయింది.
97 మంది సభ్యులున్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ లో మేయర్ పదవిని గత వైసీపీ ప్రభుత్వం అప్పట్లో సునాయాసంగా కైవసం చేసుకుంది. దీంతో మేయర్ గా గొలగాని హరి వెంకటకుమారి పగ్గాలు చేపట్టారు. ఆమె నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అనుకూలంగా ఉన్న నిబంధనల సాయంతో కూటమి పార్టీలు ఆమెపై అవిశ్వాసం ప్రతిపాదించాయి. దీంతో విశాఖలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

వైసీపీతో పాటు కూటమి పార్టీలు తమ కార్పోరేటర్లను దేశ, విదేశాల్లోని క్యాంపులకు తరలించాయి. మరికొందరు వైసీపీ కార్పోరేటర్లు స్వచ్చంధంగానే పార్టీని వీడి కూటమి పార్టీలైన టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో కూటమి బలం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇవాళ అవిశ్వాస తీర్మానంపై విశాఖ కార్పోరేషన్ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేశారు. దీనికి కూటమి తరఫున ఏకంగా 72 మంది కార్పోరేటర్లు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో అవిశ్వాస తీర్మానం సునాయాసంగా నెగ్గింది. ఇదంతా ముందే ఊహించిన వైసీపీ ఓటింగ్ కు దూరంగా ఉండిపోయింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు స్ధానిక సంస్ధల్లో మేయర్లు, ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టించి గెలుస్తూ వస్తున్న కూటమి ఖాతాలో ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్ కూడా చేరిపోయింది. అయితే కూటమి తరఫున మేయర్ పదవి చేపట్టే వారికి కేవలం 8 నెలల పదవీకాలం మాత్రమే ఉండబోతోంది. ఆ తర్వాత ఎలాగో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో ఓ దశలో అవిశ్వాసం వద్దని కూటమి పార్టీల్లో కొందరు నేతలు సూచించారు. అయితే అధిష్టానాలు మాత్రం వేరే ఉద్దేశంతో ఉన్నాయి. జీవీఎంసీ మేయర్ పీఠం కైవసం చేసుకుంటే విశాఖలో తమకు మొగ్గు లభిస్తుందని భావించాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications