చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లో వైసీపీ ఎమ్మెల్యే హంగామా.. పూనకాలు లోడింగ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీల నేతలకు మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

వాల్తేరు వీరయ్య సినిమా చూసిన వైసీపీ ఎమ్మెల్యే హంగామా
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఓ థియేటర్ ని బుక్ చేసి, తన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు అందరితో చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాను చూశారు. అందరికీ ఫ్రీ షో వేయించిన బియ్యపు మధుసూదన్ రెడ్డి వాల్తేరు వీరయ్య లో చిరంజీవి నటనకు, అన్నదమ్ముల మధ్య అనుబంధానికి కితాబిచ్చారు. అంతే కాదు ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఇక థియేటర్లో హంగామా చేసిన బియ్యపు మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేశారు. తమ వారందరితో వాల్తేరు వీరయ్య చిత్రాన్ని చూసిన ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి సినిమా ప్రమోట్ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపికి, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న జనసేనకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య సినిమాను చూసి, అద్భుతంగా ఉందని ప్రశంసించడంతో వైసీపీ ఎమ్మెల్యే తీరుపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. సినిమాని వైసీపీ ఎమ్మెల్యే ప్రమోట్ చేస్తున్న తీరు కూడా ఆసక్తికరంగా ఉంది. ఇక సోషల్ మీడియా వేదికగా తాను చిన్నప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానినని, వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఆయన చెప్పడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

అన్నయ్యను చూసి తమ్ముడు నేర్చుకోవాలన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
అంతేకాదు ఈ సమయంలో రాజకీయం గురించి మాట్లాడితే చాలా దూరం వెళుతుంది అని పేర్కొన్న ఆయన అన్నయ్యను చూసి తమ్ముడు చాలా నేర్చుకోవాలి అంటూ పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు బియ్యపు మధుసూదన్ రెడ్డి. మెగాస్టార్ అభిమానుల ఓటు బ్యాంకు కోసం బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ తరహా చీఫ్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని చిరంజీవి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాలకు భిన్నంగా స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే
మెగాస్టార్ అభిమానులు కచ్చితంగా జనసేనకి ఓటేస్తామంటూ ఆయన చేసిన పోస్ట్ కు పలువురు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సంక్రాంతి సందర్భంగా విడుదలైన చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతోపాటు, వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తుంది. రాజకీయాలకు భిన్నంగా వైసిపి ఎమ్మెల్యేలు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications