జగన్ పార్టీ ఎమ్మెల్యే: టిఆర్ఎస్‌కు ఓటేసి, కెసిఆర్‌పై ఫైర్

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)కి ఓటేసిన వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును తీవ్రంగా విమర్శించారు.

వాగ్దానాల అమలులో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రసేఖర రావు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలను కూడా టిఆర్ఎస్ ఆదుకోలేదని ఆయన తప్పు పట్టారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

YSRCP MLA criticise KCR after voting in favour of TRS

కెసిఆర్ ఏడాది పాలనలో సామాన్యుడికి ఒరిగిందేమీ లేదని ఆయన అన్నరు. టిఆర్ఎస్‌కు ఎన్నికల వరకే తమ మద్దతు ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని పార్టీలతో కలిసి ప్రజా సమస్యలపై టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని పొంగులేటి చెప్పారు.

ఓటుకు నోటు వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో కలిసి రాజభవన్‌కు వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+