జగన్ కు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్-మంత్రి ఇవ్వకుండా దెబ్బకొట్టారు- నేనూ కొడతా

ఏపీలో తాజాగా జరిగిన కేబినెట్ ప్రక్షాళన మంటలు ఇంకా ఆరడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అధిష్టానంపై నిప్పులు చెరిగారు. అధిష్టానం మంత్రి పదవి ఇవ్వకుండా దెబ్బకొట్టిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి పదవి ఇవ్వకుండా వైసీపీ అధిష్టానమే తనను దెబ్బకొట్టిందని, అవకాశం వచ్చినప్పుడు తానూ దెబ్బ కొడతానని గొల్లబాబూరావు హెచ్చరించారు. వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాబూరావు మంత్రి పదవి ఇవ్వకుంటే హింసావాదిగా మారతానంటూ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా మరింతగా రెచ్చిపోయారు. ఈ బోడి రాజకీయాలు నాకెందుకు, ఒక్క మాట కోసం వాళ్లతో వెళ్లానని గుర్తుచేశారు. వైఎస్ చనిపోయాక బలమైన కాంగ్రెస్ పార్టీని వీడి హింసావాదంతో వైసీపీలోకి వెళ్లినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు.

ysrcp mla golla baburao sensational comments on ys jagan, says violent, will hit soon

వైసీపీలోకి వెళ్లిన రోజు ఎవరెవరో ఏవేవో అన్నా పట్టించుకోకుండా వెళ్లానని, పార్టీలోకి వచ్చి ఎన్నో త్యాగాలు చేస్తే.. ఇవాళ తనను అమాయకుడిగా భావించి అధిష్టానం పదవి ఇవ్వలేదని బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న లక్షల మందికి ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తాను వైసీపీ అధిష్టానం అమాయకుడిని అనుకుంటుంటోందని, కానీ తాను నూటికి లక్షశాతం హింసావాదినని బాబూరావు తెలిపారు. ఇదే విషయం లక్ష మందితో మీటింగ్ పెట్టి చెబుతానన్నారు. కావాలంటే జైల్లో పెట్టుకోమనండి అంటూ రెచ్చిపోయారు. ఒకరిని చంపితే మరొకరిని చంపాలని, లేకపోతే న్యాయం ఎక్కడుంటుందని బాబూరావు ప్రశ్నించారు.

జగన్ పిలిస్తే వెళ్తానని, పిలవకుండా ఎలా వెళ్తానని బాబూరావు ప్రశ్నించారు. తన ఆవేదన చెప్పుకునేందుకు 70 కార్లలో 250 మందితో వెళ్లానని, పార్టీ నేత సజ్జల మాత్రం స్పందించలేదన్నారు. అలాంటప్పుడు ఏం చేస్తామని బాబూరావు ప్రశ్నించారు. అందుకే చెప్తున్నా నన్ను వాళ్లు దెబ్బకొట్టారు, నేనూ కొడతానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+