షాకింగ్: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి కొడుకు ఆత్మహత్యాయత్నం -గాలి ఫ్యామిలీ బెదిరింపులు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబానికి సంబంధించి షాకింగ్ వార్త ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే తనయుడు కాపు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. స్థానికులు, ఆస్పత్రి వర్గాల అందిన సమాచామంటూ పలు మీడియా సంస్థలు వెల్లడించిన వివరాలివి..

గాలి ఫ్యామిలీతో తగువులు..

గాలి ఫ్యామిలీతో తగువులు..

రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కొడుకు ప్రవీణ్ కుమార్ రెడ్డి.. కర్ణాటకలోని బళ్లారిలో పలు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఎంతో దగ్గరైన గాలి జనార్ధన్ రెడ్డి(బళ్లారి) కుటుంబీకులతోనే కాపు ప్రవీణ్ రెడ్డి భాగస్వామిగా కొనసాగుతున్నారు. జనార్ధన్ రెడ్డి సోదరుడైన గాలి సోమశేఖర్ రెడ్డి కొడుకు శ్రవణ్ కుమార్ తో ప్రవీణ్‌కు ఉన్న భాగస్వామ్య వ్యాపారం బెడిసికొట్టిన నేపథ్యంలోనే ఆత్మహత్యాయత్నం ఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది.

కియా కార్ల షోరూంలో కిరికిరి

కియా కార్ల షోరూంలో కిరికిరి

ఏపీ వైసీపీ, కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల కొడుకులిద్దరూ కొన్నాళ్ల కిందట బళ్లారి సిటీలోని హోస్పేట్‌ రోడ్డులో కియా కార్ల షోరూంను భాగస్వామ్యంతో ప్రారంభించారు. మొదట్లో వ్యవహారాలు సాఫీగా సాగినా, రానురాను లావాదేవీల్లో తేడాలొచ్చాయని, దీంతో లెక్కలు తేల్చుకుందామంటూ కాపు ప్రవీణ్ ను శ్రవణ్, అతని సోదరులు రెండుమూడు నెలలుగా పిలుస్తున్నారని, అయినాసరే ప్రవీణ్‌ కాలయాపన చేస్తుండటంతో నేరుగా గాలి సోమశేఖర్ రెడ్డే జోక్యం చేసుకున్నారని, ఆయన ఎంట్రీతోనే వ్యవహారం ఆత్మహత్యాయత్నానికి దారితీసిందని సమాచారం. ఆరోజు..

 ఒంటిపై పెట్రోల్ పోసుకుని..

ఒంటిపై పెట్రోల్ పోసుకుని..

కాపు ప్రవీణ్ రెడ్డితో లెక్కలు తేల్చుకునేందుకు బళ్లాలి ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం స్వయంగా తన కొడకులతో కలిసి కియా కార్ల షోరూం వద్దకు చేరుకోగా, అప్పటికి ప్రవీణ్‌ షోరూం వద్దకు రాలేదని, దీంతో అసహనానికి గురైన సోమశేఖర్‌రెడ్డి ప్రవీణ్‌కు ఫోన్‌ చేసి అర్జెంటుగా రావాలని పిలిచాని తెలిసింది. తప్పని పరిస్థితుల్లో ఇంటి నుంచి కారులో బయలుదేరిన ప్రవీణ్.. వెంట ఒక క్యాన్‌లో పెట్రోల్‌ నింపుకొని కారులో పెట్టుకొచ్చారు.

షోరూంలో లావాదేవీల ఫైల్‌ ఇవ్వాలని గాలి ఫ్యామిలీ అడగ్గా వారి మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రవీణ్‌ను ఎమ్మెల్యే సోమశేఖర్‌రెడ్డి కాస్త గట్టిగానే మందలించడంతో తీవ్ర మనస్తాపం చెంది, పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశారు. షోరూంలోని సిబ్బంది ప్రవీణ్ ను అడ్డుకుని, హుటాహుటిన బళ్లారి సిటీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్‌ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు. ఈ ఘటనపై కాపు, గాలి కుటుంబాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+