Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భువనేశ్వరి కాళ్లు కన్నీళ్లతో కడుగుతాం-వైసీపీ ఎమ్మెల్యే సంచలనం- వివాదానికి ఫుల్ స్టాప్

ఏపీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎపిసోడ్ అసెంబ్లీలో, బయట ఎంతగా కలకలం రేపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ వివాదంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి కొడాలి నాని అసెంబ్లీలో తాము ఆమెను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పదే పదే చెప్తున్నా ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే అంతకు ముందే బహిరంగంగా చంద్రబాబుపై వీరంతా నిత్యం ఆరోపణలు చేస్తున్న వారే. అయితే తాజాగా భువనేశ్వరిపై ఆరోపణలకు ఆద్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే వంశీ సారీ చెప్పారు. అయినా ఇంకావివాదం ముగియలేదు. దీంతో ఇవాళ మరో వైసీపీ ఎమ్మెల్యే ఆమెకు సారీ చెప్పారు.

 భువనేశ్వరిపై వ్యాఖ్యల వివాదం

భువనేశ్వరిపై వ్యాఖ్యల వివాదం

ఏపీ అసెంబ్లీలో విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరిపైనా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. కానీ అసెంబ్లీలో అలాంటి వ్యాఖ్యలేవీ రాలేదని స్పీకర్ తమ్మినేని తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రి కొడాలి కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ తన భార్యను అవమానించారంటూ బహిరంగంగా కన్నీళ్లు పెట్టుపకోవడంతో వీరి వివరణకు విలువ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తాజాగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

 భువనేశ్వరికి వల్లభనేని వంశీ సారీ

భువనేశ్వరికి వల్లభనేని వంశీ సారీ

నారా భువనేశ్వరిపై విమర్శలకు ఆద్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తాజాగా టీవీ 9 తో మాట్లాడుతూ సారీ చెప్పారు. భువనేశ్వరి తనకు అక్కలాంటిదన్నారు. ఆమెపై తాను అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పేనన్నారు. ఆమె బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నానన్నారు. అదే సమయంలో లైన్ లోకి వచ్చిన మంత్రి కొడాలి నాని వంశీ తాను చేసిన 5 శాతం తప్పుకు క్షమాపణ చెప్పారని, కానీ తన భార్య భువనేశ్వరిని బజారుకు లాగి 95 శాతం తప్పుచేసిన చంద్రబాబు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వివాదం మళ్లీ మొదటికొచ్చింది.

 వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు రియాక్షన్

వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు రియాక్షన్

వంశీ క్షమాపణ చెప్పడంతో మళ్లీ మొదటికొచ్చిన మభువనేశ్వరి ఎపిసోడ్ లో తాజాగా వైసీపీకి చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి దూరారు. భువనేశ్వరి ఎపిసోడ్ పై స్పందించిన ఆయన.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలను కోరారు. దీంతో ఇప్పుడు రాచమల్లు వ్యాఖ్యలు సైతం వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ సంచలనం రేపుతున్నాయి. అసలు ఈ వివాదంలో రాచమల్లు స్పందించాల్సిన అవసరం ఏముందన్న చర్చ కూడా జరుగుతోంది.

 కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతాం

కన్నీళ్లతో భువనేశ్వరి కాళ్లు కడుగుతాం

భువనేశ్వరి కాళ్లు కన్నీళ్లుతో కడుగుతానని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. మహిళను ఎవరు కించపరిచినా అది తప్పేనన్నారు. ఈ విషయానికి ఇంతటితో ముగింపు పలకాలని ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నానని ప్రకటించారు. ఒకవేళ భువనేశ్వరి అక్క తనని అనరాని మాటలు, వ్యక్తిత్వాన్ని కించపరిచారని భావించి ఉంటే.. ఆమె అనుమతితో కన్నీళ్లతో కాళ్లు కడుగుతానని తెలిపారు. వైఎస్ సతీమణి విజయలక్ష్మి అయినా.. చంద్రబాబు సతీమణి అయినా ఒకే గౌరవం ఉంటుందని రాచమల్లు వెల్లడించారు. తద్వారా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆయన వ్యక్తిగతంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+